
ప్రధాని నరేంద్ర మోడీ ఢిల్లీ నుంచి పార్లమెంటు భవన్ వద్దనున్న మట్టిని , ఢిల్లీ గుండా ప్రవహించే యమునా నది తీరంలోని జలాన్ని తీసుకొచ్చారు. అమరావతి నగర నిర్మాణానికి సేకరించే మన మట్టి, మన నీరు అనే చంద్రబాబు ప్రకటనతో ప్రధాని ఢిల్లీ నుంచి వీటిని తెచ్చారు. ఇవే కానీ ఇంకా ఎలాంటి హామీలు ఏపీకి మోడీ ఇవ్వలేదు..
నరేంద్ర మోడీ ఎన్నికలకు ముందు ఏపీ కి ప్రత్యేక ప్యాకేజీ అని, ప్రత్యేక హోదా ఇస్తానని ఎన్నో హామీలు ఇచ్చారు. మళ్లీ నిన్న అమరావతి శంకుస్థాపనకు వచ్చారు. కానీ ఉత్త చేతులతో వచ్చారు. ఢిల్లీ నుంచి వట్టి మట్టి తెచ్చి ఏపీ ప్రజల నోట్లో మట్టి కొట్టారు. ఒక్క హామీ కూడా ఇవ్వలేదు.. ఉత్త మట్టి ఇచ్చి ప్యాకేజీ, ప్రత్యేక హోదా పై ఎటువంటి ప్రకటనలు చేయలేదు.
దీంతో ప్రజలు, విపక్షాలు తీవ్రంగా నిరాశ చెందారు. మోడీ ఏపీ నోట్లో ఢిల్లీ మట్టి కొట్టారని విమర్శలు ఎక్కువయ్యాయి..