Breaking News

ఏపీ, తెలంగాణలో రెండు గ్రామాల దత్తత

00mahesh1

రీల్ లైఫ్ లోనే కాదు.. రియల్ లైఫ్ లోనూ మహేశ్ మెసేజ్ ఇచ్చాడు. శ్రీమంతుడు గ్రామాన్ని దత్తత తీసుకొని ఆదర్శ పాఠాలు నేర్పిన సూపర్ స్టార్ మహేశ్ బాబు.. నిజజీవితంలోనూ తనదైన శైలిలో మానవత్వాన్ని చాటాడు..

మహేశ్ బాబు శ్రీమంతుడు స్ఫూర్తితో తెలంగాణ, ఏపీలో రెండు గ్రామాలను దత్తత తీసుకోనున్నట్టు ప్రకటించారు. ఇందులో భాగంగా తన సొంతూరైన , తన తండ్రి ప్రముఖ కథానాయకుడు కృష్ణ స్వగ్రామం అయిన గుంటూరు జిల్లా బుర్రిపాలెంను, అలాగే తెలంగాణలోనే వెనుకబడిన జిల్లా అయిన మహబూబ్ నగర్ లో ఓ గ్రామాన్ని దత్తత తీసుకోనున్నట్టు మహేశ్ బాబు ట్విట్టర్ ద్వారా ప్రకటించారు.

ఏపీలో తన బావ, గుంటూరు ఎంపీ గల్ల జయదేవ్ కోరిక మేరకు బుర్రిపాలెంను దత్తత తీసుకున్నానని.. అలాగే తెలంగాణలో మంత్రి కేటీఆర్ సూచన మేరకు మహబూబ్ నగర్ జిల్లా గ్రామాన్ని దత్తత తీసుకోనున్నట్టు ప్రకటించారు. మహబూబ్ నగర్ ఏ గ్రామం అనేది త్వరలో చెబుతానని ప్రకటించారు.

00mahesh

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *