
ఢిల్లీ, ప్రతినిధి : ఏపీ ప్రభుత్వం కోరితే ఎంసెట్‌ను ఉమ్మడిగా నిర్వహించేందుకు తాము సహకరిస్తామని తెలంగాణ మంత్రి జగదీష్ రెడ్డి తెలిపారు. ఢిల్లీలో జరుగుతున్న విద్యాశాఖ మంత్రుల సమావేశంలో పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ పునర్విభజన చట్టం ప్రకారం ఎంసెట్ నిర్వహించే హక్కు తెలంగాణాకే ఉందని తెలిపారు.
ఏపీ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వంతో సంప్రదించకుండానే ఏకపక్షంగా ఎంసెట్ నోటిఫికేషన్‌ను విడుదల చేసిందన్నారు. సమస్యను పరిష్కరించేందుకు తాము ఎప్పుడూ సిద్ధంగా ఉన్నామన్నారు. ఏపీ ప్రభుత్వం కోరితే ఎంసెట్‌ను ఉమ్మడిగా నిర్వహించేందుకు తాము సహకరిస్తామని మంత్రి జగదీష్ తెలిపారు.