ఏపీ అసెంబ్లీలో వైసీపీ సభ్యుల సస్పెన్షన్

ycp

ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే అత్యంత చెత్తగా జరుగుతున్న శాసనసభా సమావేశాలకు ఈ సంవత్సరం వేదికగా మారింది. ఏపీ అసెంబ్లీలో అధికార ప్రతిపక్ష నాయకుల తిట్లు శాపనార్థాలు, తోపులాటలు, చివరకు బూతు పర్వంతో శాసనసభ రణంరంగాన్ని తలపిస్తోంది. ఎన్నడూ లేనంతగా సభ్యులు హద్దుమీరి పరస్పరం దూషణల పర్వం కొనసాగిస్తున్నారు.

గురువారం అసెంబ్లీలో వైసీపీ ఆందోళనల నేపథ్యంలో ఎనిమిది మంది వైసీపీ ఎమ్మెల్యేలను స్పీకర్ కోడెల ఈనెల 23వరకు సస్పెండ్ చేశారు. ఆర్థికమంత్రి యనమల ప్రవేశపెట్టిన ఈ సస్పెన్షన్ తీర్మానానికి సభ ఆమోదం తెలిపింది.

వైసీపీ సభ్యులు గడికోట శ్రీకాంత్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ముత్యాల నాయుడు, కొడాలి నాని, జగ్గిరెడ్డి, పిన్నెల్లి రామకృష్నారెడ్డి, శివప్రసాద్ రెడ్డి, చాంద్ పాషా సస్పెన్షన్ అయిన వారిలో ఉన్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *