ఏపీలో 150కే ఇంటర్నెట్

హైదరాబాద్, ప్రతినిధి : హైటెక్ బాబు ఏపీని స్మార్ట్ రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు అడుగులు వేస్తున్నారు. ఏపీ లోని 1.30 కోట్ల కుటుంబాలకు 150 రూపాయలకే ఇంటర్నెట్ సౌకర్యం కల్పించాలని నిర్ణయించారు. ఈ మేరకు ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్ట్‌కు రాష్ట్ర మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్ట్ అమలు కోసం ప్రారంభ మూలధనంగా 10 కోట్లు కేటాయించారు. అంటే.. ఇక రాష్ట్రంలోని ప్రతి పల్లెలో ఇంటింటికి ఇంటర్నెట్ సౌకర్యం కల్పించి ఏపీని సాంకేతిక రాష్త్రంగా మారుస్తారు.

1.30 కోట్ల ఇళ్ళకు 10-15  ఎంబీపీఎస్ వేగంతో ప్రతీ ఇంటికి ఈ సదుపాయం వుంటుంది. అంతే కాదు.. ‘చంద్రన్న సంక్రాంతి కానుక’ పేరుతో రాష్ట్రంలోని పేద కుటుంబాలకు  రూ. 245 విలువైన అరకిలో కందిపప్పు, అరకిలో పామాయిల్, అరకిలో బెల్లం, కేజీ శనగలు, కిలో గోధుమపిండి, వంద గ్రాముల నెయ్యి, ప్యాకేజీ ఇవ్వాలని, ఈ నెల 13వ తేదీకల్లా వీటిని పంపిణీ చేయాలని  నిర్ణయించారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published.