ఏపీలో శరవేగంగా పారిశ్రామికాభివృద్ధి

ఏపీ సీఎం చంద్రబాబు పారిశ్రామికాభివృద్ధి కి చేసిన కృషి ఫలిస్తోంది. దేశ విదేశాల్లో చంద్రబాబు తిరిగుతూ పారిశ్రామిక వేత్తలను ఆహ్వానిస్తున్నారు. దీంతో దిగ్గజ కంపెనీలు ఏపీలో పెట్టుబడులకు ముందుకు వచ్చాయి. మొన్న చిత్తూరులోని సెజ్ లో దేశంలోనే పెద్దదైన ప్లాంట్ ను శీతల పానీయ కంపెనీ పెప్సీ ప్రారంభించింది. ఆ కంపెనీ సీఈవో ఇంద్రనూయి వచ్చి మరీ ప్లాంట్ ను ప్రారంభించారు. ఆ తర్వాత నిన్న చైన్నైకి సమీపంలోని నెల్లూరు జిల్లా శ్రీ సిటీ సెజ్ లో పలువురు ఫార్మా అధిపతులు తమ ప్లాంట్ లను ఇక్కడ ప్రారంభించేందుకు సీఎం చంద్రబాబుతో కలిసి ప్రారంభోత్సవాలు చేశారు. శ్రీ సిటీ సెజ్ ప్రత్యేకంగా ఫార్మా కంపెనీల కోసమే ఏర్పాటు చేశారు. ఇక్కడికి దేశ, విదేశీ ఫార్మా కంపెనీలు ప్లాంట్లు ఏర్పాటు చేసేందుకు ముందుకు వస్తున్నాయి.

ఇదే కాకుండా గుంటూరు జిల్లాలో సోమవారం సుగంధ ద్రవ్యాల పార్క్ ను చంద్రబాబు, కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ లు ప్రారంభించారు. ఇలా వరుసగా ఏపీకి పారిశ్రామిక వేత్తలు తరలివచ్చి పారిశ్రామికాభివృద్ధికి తరలివస్తున్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ పారిశ్రామిక విధానం ప్రకటించినా మొదట్లో కుప్పలుగా వచ్చిన పారిశ్రామిక వేత్తలు ఇప్పుడు ఇటువైపే చడడం లేదు కానీ ఏపీకి మాత్రం వచ్చి తమ కంపెనీలు ఏర్పాటు చేస్తున్నారు. ఏపీ సీఎం క్యాంపెయిన్ ఫలించి పెట్టుబడులు ప్రవాహం మొదలవడంతో సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *