ఏపీలో వైసీపీ x టీడీపీ తీవ్ర పోరు

jagan-chandra-babu-naidu1
అధికార టీడీపీ హవా ఏపీలో కొనసాగుతోంది.. చంద్రబాబు ఏపీ సీఎం అయ్యాక వలసలు కొనసాగాయి.. కాంగ్రెస్, వైసీపీ నుంచి నాయకుల చేరడంతో ఇప్పుడు టీడీపీకి కొండంత బలమొచ్చింది. అందుకే బాబు వైసీపీ నేతలు ఎక్కడ చిక్కినా వదిలిపెట్టడం లేదు.. ముఖ్యంగా వైసీపీ అధినేత జగన్ తమను టార్గెట్ చేసి అసెంబ్లీలో చెడుగుడు ఆడుకుంటుంటుడడంతో ఆయనకు పీచమణేలా వ్యవహరిస్తున్నారు టీడీపీ నేతలు.. అందుకే జగన్ దగ్గరి నేతలను టార్గెట్ చేసి వారిని కేసుల్లో ఇరికించడం.. అరెస్టులు చేయడం చేసి సామధాన బేద వారిని అదుపుచేస్తున్నారు.కొద్ది రోజులుగా ఈ తంతు కొనసాగుతోంది..
ముందుకు వైసీపీ ఎమ్మెల్యే రోజాకు చెక్ పెట్టింది టీడీపీ.. అసెంబ్లీలో చంద్రబాబును దూషించిన ఆమెపై ఒక సంవత్సరం నిషేధం విధించారు. అనంతరం రాజంపేట వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని సైతం విమానాశ్రయ ఉద్యోగిని కొట్టాడనే నెపంతో ఇటీవలే అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. వీరే కాదు.. గుడివాడ ఏకుమేకులా తయారైన వైసీపీ ఎమ్మెల్యే నానిపై ప్రతీకారం తీర్చుకుంది టీడీపీ.. ఆయన వైసీపీ కార్యాలయాన్ని గుడివాడలో లేకుండా చేసింది. ధర్నాలు, రాస్తారోకో లు చేసినందుకు అరెస్ట్ చేసి జైల్లో పెట్టింది..
ఇప్పుడు ఏకంగా వైసీపీలో కర్నూలు జిల్లా కీలకనేతలైన ఎమ్మెల్యే భూమా, అఖిల ప్రియ, మరో ఇద్దరు ఎమ్మెల్యేలను టీడీపీలో చేర్చుకొని జగన్ కు గట్టి షాక్ ఇచ్చారు చంద్రబాబు. మున్ముందుకు భారీగా వైసీపీ ఎమ్మెల్యేలను చేర్చుకునేందుకు పావులు కదుపుతున్నారు..
జగన్ కు బాగా దగ్గరైన.. చురుకైన నాయకులను టార్గెట్ చేసి వారిని ముప్పుతిప్పలు పెట్టేందుకు ఏకంగా టీడీపీలో బాబు సన్నిహిత నేతకు బాధ్యతలు అప్పించినట్టు సమాచారం.. ఇప్పుడు ఆయన అదే పనిలో వైసీపీ నాయకులను టార్గెట్ చేసి ఆడుకుంటున్నాడట..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *