ఏపీలో మోస్ట్ కాంట్రవర్సీ పొలిటీషన్ ఈమెనట..

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత.. వైఎస్ జగన్ కాంట్రవర్సీ పొలిటీషన్ రేసులో వెనుకబడ్డారు. ఎందుకంటే ఇప్పుడు ఏపీలో మోస్ట్ కాంట్రవర్సీ పొలిటీషన్ ‘రోజా’నేనట.. అంతలా రాజకీయాల్లో రెచ్చిపోతున్నారు ఎమ్మెల్యే రోజా.. మొన్నటి అసెంబ్లీలో అధికార టీడీపీని ఓ ఆటాడేసుకున్నారు రోజా. ఎంతలా అంటే అసెంబ్లీ ఏకపాత్రిభనయం చేశారు. బూతులు, వెకిలి చేష్టలతో నానా బీభత్సం చేశారు. మంచి పంచ్ డైలాగులతో టీడీపీ నేతలపై దుమ్మెత్తిపోశారు.

నిన్న నైతే ప్రజాసమస్యలపై ఎమ్మెల్యే రోజా చిత్తూరు ధర్నాకు హాజరై హల్ చల్ చేశారు. పోలీసులు, టీడీపీ కార్యకర్తలు అడ్డుకొని  ఆమె ధర్నాను  భగ్నం చేయడానికి ప్రయత్నించారు. దీంతో రోజా కన్నీటిపర్యంతం అయ్యారు. టీడీపీ నేతల తీరును మీడియా సాక్షిగా ఎండగట్టారు. కాంట్రవర్సీని పీక్ స్టేజ్ కి తీసుకెళ్లారు. ఇలా ఏపీలో ఏ నాయకుడు కానంత వివాదాస్పదంగా వ్యవహరిస్తున్నారు రోజా.. కనీస ప్రతిపక్ష నాయకుడు కూడా ఆమెలా మీడియా నోళ్లలో.. టీడీపీ నేతలకు టార్గెట్ కావట్లేదు.. కానీ రోజా మాత్రం ఇప్పుడు ఏపీలో హాట్ పొలిటీషన్…

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *