Breaking News

ఏపీలో మొదలైన మరో ఉద్యమం

dc-Cover-ecqc8uqbth6ob77qejn2gtoj64-20160131205925.Medi

కాపుల ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం నిర్వహించిన కాపుల సింహగర్జన తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది.. ఏపీలో కొత్తగా మొదలైన కాపుల హక్కుల సాధన ఉద్యమం,, కాపులను బీసీల్లో కలపాలనే ప్రధాన డిమాండ్ తో చేసిన ఆందోళన హింసాత్మకంగా మారింది. ఆదివారం తూర్పుగోదావరి జిల్లా తునిలో కాపుల గర్జన హింసాత్మకంగా మారి భారీ ఉద్రిక్తతలకు దారితీసింది.. రెచ్చిపోయిన కాపు గర్జనకు వచ్చిన యువకులు దాడులకు దిగారు. వీరిదాడుల్లో తుని పోలీస్ స్టేషన్, పోలీసుల వాహనాలు, చాలా మంది పోలీసులు గాయపడ్డారు.. అంతేకాదు తుని రైల్వే స్టేషన్ పై కూడా దాడిచేసి రైళ్లకు నిప్పు పెట్టారు.. దీంతో ప్రయాణికులు పిల్లలు, వస్తువులతో పరుగులు పెట్టారు. దాదాపు 10 లక్షల మంది కాపు యువకులు చేసిన ఆందోళనతో కట్రోంల్ చేయలేక పోలీసులే పరుగులు తీసిన పరిస్థితి ఏర్పడింది..

తీవ్ర ఆస్తి,విధ్వంసం జరిగిన ఈ ఆందోళనలలో మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ఇచ్చిన పిలుపే కారణం.. దీనిపై ఏపీ ప్రభుత్వం ఉలిక్కిపడింది. వెంటనే ఏపీ సీఎం చంద్రబాబు రాత్రి విలేకరుల సమావేశం పెట్టి కాపుల డిమాండ్ కు అనుగుణంగా కాపులను బీసీలను చేరుస్తామని ప్రకటించారు. అంతేకాదు.. ఈ కాపుల ఆందోళన వెనుక వైసీపీ అధినేత జగన్ ఉన్నాడని చంద్రబాబు ఆరోపించారు.. కాగా ముద్రగడ కాపులకు రిజర్వేషన్ అందించే జీవోను 24 గంటల్లో విడుదల చేయాలని.. లేకపోతే ఆమరణ దీక్ష ఆందోళన చేస్తామని హెచ్చరించారు. దీంతో ఇప్పుడు ఏపీ ప్రభుత్వం ఏమీ చేయాలో తెలియక కంగారుపడుతోంది..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *