
హైదరాబాద్ , ప్రతినిధి : ఆంధ్రప్రదేశ్ లో ఇకపై పెట్రోల్ కొనాలంటే డ్రైవింగ్ లైసెన్సు, ఆర్ సి లకు ఆధార్ అనుసంధానం తప్పనిసరి. వాహనదారులు, డ్రైవింగ్ లెసైన్సులు కలిగి ఉన్న వారి నుంచి ఆధార్ అనుసంధానం కోసం పెట్రోల్ బంకులను ఆశ్రయించాలని రవాణాశాఖ నిర్ణయించటమే ఇందుకు కారణం.
ఈ విషయమై హెచ్‌పీసీఎల్, బీపీఎల్, ఐఓసీ ఆయిల్ కంపెనీలతో చర్చిస్తూ, రవాణాశాఖ మంత్రి శిద్ధా రాఘవరావు చేసిన ప్రతిపాదనలను ఆయిల్ కంపెనీల ప్రతినిధులు అంగీకరించడంతో, త్వరలోనే జీవో విడుదల కానున్నట్టు సమాచారం.