ఏపీలో ఇప్పుడు చంద్రబాబుకు ఆ పత్రికే శత్రువట..

Mumbai: Andhra Pradesh Chief Minister N Chandrababu Naidu speaks at the Andhra Pradesh Investors Summit at the Make In India week in Mumbai on Tuesday. PTI Photo by Mitesh Bhuvad  (PTI2_16_2016_000231A)

ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి విలేకరుల సమావేశంలో మండిపడ్డారు. ఏపీ నూతన రాజధాని అమరావతిలో సచివాలయం నిర్మాణ పనుల్లో అవినీతి జరిగిందని.. కొత్త సచివాలయం 3 అడుగులు భూమిలోకి కుంగిందని సాక్షి పత్రికలో పతకా శీర్షికన కథనం ప్రచురితమైన సంగతి తెలిసిందే.. అలాగే సాక్షి చానల్ లో కూడా దీనిపై వరుస కథనాలు వెలువడ్డాయి.

ఈ నేపథ్యంలో అమరావతిలో విలేకరులతో మాట్లాడిన చంద్రబాబు.. తాను రోజుల్లో 20 గంటలు రాష్ట్రం కోసం శ్రమిస్తున్నా కొన్ని పత్రికలు పనిగట్టుకొని తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీలో సాక్షి పత్రిక, చానల్ లు టీడీపీ ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేస్తున్నాయని మండిపడ్డారు. జగన్ అండతో రెచ్చిపోతున్నాయని మండిపడ్డారు.

ఇంతకుముందే కాపుల ఉద్యమం సమయంలో రెచ్చగొట్టేలా చేస్తున్నారని ఏపీలో సాక్షి చానల్ ప్రసారాలను నిలిపివేశారు. ఇప్పుడు చంద్రబాబు పత్రికపై దుమ్మెత్తిపోశారు. ఏపీ ప్రభుత్వంపై కత్తిగట్టి వార్తలు రాస్తున్న సాక్షి పత్రికే ఇప్పుడు చంద్రబాబుకు ప్రధాన శత్రువులా కనిపిస్తోంది..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *