ఏపీపీఎస్సీ x టీ.ఎస్.పీ.ఎస్.సీ

హైదరాబాద్, ప్రతినిధి : ఉద్యోగులు ఘర్షణ పడుతున్నారు. ఏపీపీఎస్సీ ఉద్యోగుల వైఖరిపై టీ.ఎస్.పీ.ఎస్.సీ ఆందోళన నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర సర్టిఫికెట్లు ఇవ్వకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఏపీపీఎస్సీలోని తెలంగాణ పదిజిల్లాలకు సంబంధించిన సర్టిఫికెట్ల , ఫైళ్లను ఇవ్వాలని టీ.ఎస్.పీ.ఎస్.సీ ఉద్యోగులు లేఖ రాశారు. 15 రోజులు గడుస్తున్న ఏపీపీఎస్సీ ఉద్యోగులు పట్టించుకోలేదు. ఓ వైపు తెలంగాణ సర్కారు ఉద్యోగాల భర్తీకి చర్య తీసుకుంటుండడంతో ఈ సర్టిఫికెట్లు లేనిదే పనికాదు. కానీ ఏపీపీఎస్సీ ఉద్యోగుల సహాయ నిరాకరణతో ఆందోళన బాట పట్టారు టీ. ఉద్యోగులు. ధర్నా నిర్వహించి సర్టిఫికెట్లు ఇవ్వాలంటూ నినదించారు. ఈ వివాదం ఇప్పుడు ఏపీపీఎస్సీలో ఉద్రిక్తతలకు దారితీస్తోంది.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *