Breaking News

ఏపీకి 850 కోట్ల కేంద్ర సాయం

modi-chandrababu-aphunt

-ఏపీ, తెలంగాణలో పరిశ్రమలకు రాయితీ

హైదరాబాద్, ప్రతినిధి : కనీసం జీతాలు చెల్లించడానికి కూడా కానకష్టంగా వెళ్లదీస్తున్న ఏపీ ప్రభుత్వానికి తీపికబురు. కేంద్రం ఆంధ్రప్రదేశ్ ద్రవ్యలోటును పూడ్చేందుకు ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చింది.ఉత్తరాంధ్ర , రాయలసీమ జిల్లాలకు 350 కోట్లు సాయాన్ని ప్రకటించిన కేంద్రం, రెవెన్యూలోటు భర్తీ చేసేందుకు తాత్కాలిక సాయం కింద మరో 500 కోట్లు ఇస్తున్నట్టు ప్రకటించింది.

ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం జిల్లాకు 50కోట్టు చొప్పున రాయలసీమ లోని నాలుగు , ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాలకు మొత్తం 350 కోట్లను ఈ ఆర్థికసంవత్సరంలోనే ఇవ్వనున్నట్లు కేంద్రం వెల్లడించింది. అలాగే రాష్ట్రంలోని రాష్ట్రంలోని ఆర్థికపరిస్థితులపై అధ్యయనం చేయడానికి అంతర్గత మంత్రివర్గ కమిటీని నియమించారు. కమిటీ ఇఛ్చే సిఫార్సుల ఆధారంగా 2014-15 సంవత్సరానికి మరింత సాయం చేయాలని నిర్ణయించారు.

అలాగే ఏపీ, తెలంగాణలోని పారిశ్రామిక అభివృద్ధికి పన్ను రాయీతీలు ఇస్తున్నట్టు ఆర్థికమంత్రిత్వ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. వెనుకబడిన ప్రాంతాల్లో ఏర్పాటుచేసే కొత్త పరిశ్రమలకు పన్ను రాయితీలు కల్పిస్తున్న కేంద్రం, తెలంగాణలో ఏర్పాటు చేసే పరిశ్రమలకు వర్తిస్తాయని తెలియజేసింది.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *