ఏపీకి కరువు తీర్చారు.. తెలంగాణను పక్కనపెట్టారు..

rayalaseema1436637742

కరువు సాయం విషయంలో మరోసారి తెలంగాణకు అన్యాయం చేసింది కేంద్రప్రభుత్వం.. ఏపీ, తెలంగాణతో పాటు చాలా రాష్ట్రాల్లో ఈసారి కరువు బాగా ఉంది. ఆయా రాష్ట్రాలన్నీ కరువుపై నివేదికలు అందించాయి. తెలంగాణ కూడా ఏపీతో పాటు కరువు సాయంపై నివేదిక అందజేసింది. కానీ ఏపీకి 433 కోట్లు కేటాయించి తెలంగాణకు మొండిచేయి చూపింది కేంద్రప్రభుత్వం.. జాతీయ విపత్తు సహాయ నిధి (ఎన్డీఆర్ఎఫ్) నుంచి వీటిని అందజేసేందుకు నిర్నయించింది. ఏపీతో పాటు ఉత్తరప్రదేశ్ కు 1304కోట్లు, ఒడిశాకు 85 కోట్లు కేటాయించింది.

కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ అధ్యక్షతన కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, వ్యవసాయ, రైతు సంక్షేమ మంత్రి రాధామోహన్ సింగ్, నీతిఅయోగ్ ఉపాధ్యక్షుడు అరవింద్ పనగడియా ఇందులో పాల్గొని తెలంగాణకు సాయం దాటవేసి వచ్చే సమావేశంలో నిర్ణయిస్తామని తెలిపారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *