
ఆంధ్రప్రదేశ్ లో విభజన తర్వాత తీవ్ర ఇబ్బందికర పరిస్థితులున్నాయని.. నిధులివ్వాలని కోరినా కేంద్రం నుంచి సరైన సాయం అందలేదని.. మరి సహకారం కోసం ఎదురు చూస్తన్నట్టు గవర్నర్ నరసింహన్ పేర్కొన్నారు. శనివారం ప్రారంభమైన ఏపీ బడ్జెట్ సమావేశంలో ప్రారంభ ప్రసంగం చేశారు. ఆంధ్రప్రదేశ్ విభజన లోపాల వల్ల ఏపీ తీవ్రంగా నష్టపోతోందన్నారు. రాష్ట్రంలో వెనుకబడిన 7 జిల్లాలకు ప్రత్యే ప్యాకేజీ కోసం ఎదురుచూస్తున్నామన్నారు. దీనికితోడు ప్రకృతి వైపరీత్యాల వల్ల ఏపీకి మరింత నష్టం వాటిల్లనుందన్నారు. అభివృద్ధి కోసం ప్రణాలికలు సిద్ధం అయ్యాయని.. 2029 నాటికి దేశంలో ఏపీని దేశంలోనే నంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్దుతామన్నారు. ఏపీ ప్రభుత్వం వివిధ ప్రభుత్వ పథకాలను గవర్నర్ ప్రసంగంలో చదివి వినిపించారు. రాజధాని కోసం భూములిచ్చిన రైతులకు కృతజ్ఞతలు తెలిపారు. గవర్నర్ ప్రసంగం ముగిసిన వెంటనే సభ సోమవారానికి వాయిదా పడింది.