Breaking News

ఏపీకి అన్యాయం చేశారు

chandrababu

-కేంద్ర బడ్జెట్ లో జరగని న్యాయం
-బడ్జెట్ పై అసంతృప్తి వ్యక్తం చేసిన బాబు
హైదరాబాద్,ప్రతినిధి : కేంద్రప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ కు అన్యాయం చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఆర్థికసంఘం, కేంద్ర బడ్జెట్ రెండూ ఆంధ్రప్రదేశ్ పట్ల సరిగా వ్యవహరించలేకపోయారని ఆయన నిరాశ వ్యక్తం చేశారు. దీన్ని జీర్ణించుకోలేకపోతున్నామని చంద్రబాబు వాపోయారు.

కేంద్ర ఆర్థిక మంత్రి శనివారం లోక్ సభలో ప్రవేశపెట్టిన బడ్జెట్ పై చంద్రబాబు నాయుడు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. శనివారం ఆయన లేక్ వ్యూ గెస్ట్ హౌస్ లో విలేకరులతో మాట్లాడారు. ఇప్పటికే ఏడెనిమిది సార్లు ఢిల్లీ వెళ్లానని.. అయినా ఫలితం దక్కలేదని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీకి న్యాయం చేయాల్సిన బాధ్యత కేంద్రం మీద ఉందని.. ఆయన అన్నారు. విశాఖ రైల్వే జోన్ పై ఏవిధమైన నిర్ణయం తీసుకోలేదన్నారు. తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలతో సమానంగా అభివృద్ధి చెందేలా కేంద్రం సాయం చేయాల్సిందేనని చంద్రబాబు అన్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *