ఏడెల్లి రవిందర్ కు డాక్టరేట్

చిగురుమామిడి : కాకతీయ విశ్వవిద్యాలయం అర్ధశాస్త్ర విభాగం పరిశోధకుడు ఏడెల్లి రవిందర్ డాక్టరేట్ సాధించారు. ఈ మేరకు కేయూ పరీక్షల నియంత్రణ అధికారి ఆచార్య ఎంవీ. రంగారావు మంగళవారం డాక్టరేట్ ను ప్రకటించారు. ‘ఎంప్లాయ్ మెంట్ అపార్చ్ ట్యూనిటీస్ అండ్ చాలెంజస్ ఆఫ్ ఎస్సీ అండ్ ఎస్టీ కమ్యూనిటీ ఇన్ అర్బన్ ఇన్మార్ఫర్ సెక్టర్ – ఏ స్టడీ ఇన్ తెలంగాణ’ అనే అంశంపై సమర్పించిన సిద్దాంత గ్రంథానికి డాక్టరేట్ లభించింది. ఈ యన కేయూ అర్ధశాస్త్ర విభాగం సీనియర్ ఆచార్యులు గడ్డం భాస్కర్ పర్యవేక్షణలో పరిశోధన పూర్తి చేశారు. రవిందర్ గతంలోనే యూజీసీ నెట్ ఉత్తీర్ణత సాధించారు. డాక్టరేట్ సాధించిన ఏడెల్లి రవిందర్ ను కేయూ అర్ధశాస్త్ర ఆచార్యులు , విద్యార్థులు, పరిశోధకులు అభినందించారు. ప్రస్తుతం వరంగల్ జిల్లా కాకతీయ విశ్వవిద్యాలయం మహబూబాబాద్ యూనివర్సిటీ పీజీ కళాశాలలో అసిస్టెంట్ ఫ్రొఫెసర్ గా పనిచేస్తున్నారు.

చిగురుమామిడి మండలం నవాబుపేటకు చెందిన రవిందర్ పలు జాతీయ , అంతర్జాతీయ సదస్సుల్లో పాల్గొని 16 పరిశోధన పత్రాలను సమర్పించారు. అర్ధశాస్త్రంలో సంభవిస్తున్న పరిణామాలపై రవిందర్ రాసిన పత్రాలు పలు పరిశోధన జర్నల్స్ లలో 12 వ్యాసాలను ప్రచురించారు. శాతవాహన విశ్వవిద్యాలయం ఎకనామిక్స్ ఆచార్యులు ఎం. వరప్రసాద్ , హుస్నాబాద్ లోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాల ప్రిన్సిపాల్ డి. శ్రీహరి, హుస్నాబాద్ గర్ల్స్ హైస్కూల్ ఉపాధ్యాయురాలు గడిపె భవానీ, ఉపాధ్యాయుడు మట్లెల వెంకటయ్య రవిందర్ ని అభినందించారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published.