ఏడుగురు బాల కార్మికులకు విముక్తి

మానవ అక్రమ రవాణ నియంత్రణ విభాగం (ఎహెచ్ టియు), సిసిఎస్ పోలీసులు మంగళవారం నాడు ఛైల్డ్ వెల్ఫేర్ కమిటి సహకారంతో కరీంనగర్ లో విస్త్ర్రృత తనిఖీలు
నిర్వహించి ఏడుగురు బాలకార్మికులకు విముక్తి కల్పించారు. ఎహెచ్ టియు ఇంఛార్జి ఇన్స్పెక్టర్ మహేష్ ఆధ్వర్యంలో పోలీసులు బృందాలుగా ఏర్పడి ఛైల్డ్ వెల్ఫేర్ కమిటి
సభ్యులతో నగరంలోని వివిధ ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు. వివరాలు ఇలా ఉన్నాయి. గోదాంగడ్డ ప్రాంతానికి చెందిన యం.డి.షాహిల్ హుస్సేన్ (13), ఐబిగెస్ట్ హౌజ్
ప్రాంతానికి చెందిన ఎ.అనీల్ కుమార్ (11), కార్ఖానాగడ్డ కు చెందిన యం.డి.గౌస్ ఖాన్ (14), పేషామహల్ కు చెందిన యం.డి. అబ్దుల్ అజీజ్ సోఫీ(12), అమీర్ నగర్ కు
చెందిన ఎస్.కె.అమీర్ ఉద్దీన్ (16), యం.డి.ఖాలిద్ అహ్మద్ (16), రేకుర్తికి చెందిన యం.డి.నజీర్(12)లు నగరంలోని వివిధ దుకాణాలల్లో బాలకార్మికులుగా పనిచేస్తున్నారు.
వీరిని అదుపులోకి తీసుకుని జిల్లా ఛైల్డ్ వెల్ఫేర్ కమిటికి ఛైర్ పర్సన్ కొమురయ్య, జిల్లా బాలల రక్షణ అధికారి పర్వీన్ లకు అప్పగించారు. బాలలను పనిలో పెట్టుకున్న
యజమానులకు కౌన్సిలింగ్ నిర్వహించి, హెచ్చరికలు జారీ చేశారు. సదరు బాలల ఆశ్రమంలో ఆశ్రయం కల్పించారు. బాలల తల్లిదండ్రులను పిలిచి కౌన్సిలింగ్
నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో ఎస్.ఐలు జి.వి.కృష్ణారెడ్డి, యం.సతీష్, కానిస్టేబుళ్ళు టి.సురేంద్రపాల్ సింగ్, ఎన్.వీరయ్య, యం.రజిత, ఎన్.సరోజ తదితరులు
పాల్గొన్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *