ఏడాది పాలనపై పత్రికల సర్వేలు

ap news F

రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం ఓ వైపు ఘనంగా ఏర్పాట్లు చేసుకుంటుంటే మరో వైపు పత్రికలు సీఎంలు కేసీఆర్, చంద్రబాబుల ఏడాది పాలనపై  సర్వేలు మొదలుపెట్టాయి. సంబరాల వేళ ప్రభుత్వాల లోటు పాట్లు, ఏడాదిలో ప్రజలకు, పారిశ్రామికవేత్తలకు, మొత్తంగా ఎంత అభివృద్ధి సాధించింది లేనిది నిలదీయడానికి పత్రికలు సర్వేలు పూర్తిచేశాయి.

అధికార పక్షపాత పత్రికలు తమ ప్రభుత్వాలకు 100కు 80 మార్కులు వేసి పాస్ చేయాలని ప్రయత్నిస్తుంటే.. వ్యతిరేక పత్రికలు ప్రభుత్వాన్ని కనీసం 35 మార్కులతో పాస్ చేయడానికి కూడా అస్కారం ఇవ్వడం లేదు. ఈ సర్వే ఫలితాలన్నీ జూన్ 2న రెండు తెలుగు రాష్ట్రాల అవతరణ దినోత్సవాన అన్ని పత్రికల్లో ప్రచురించడానికి సిద్ధమవుతున్నాయి. కేసీఆర్ సైతం నిన్న జరిగిన శాసనసభా సమావేశాల్లో తమ పార్టీకి పత్రికల సర్వేలో 80 శాతం ప్రజలు మద్దతిచ్చారని పేర్కొనడం గమనార్హం.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *