
నిజంగా ఇది ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనమే.. దీనివల్ల విద్యార్థులు ఒక సంవత్సర కాలాన్ని కోల్పోయారు.. డైట్ సెట్ రాసిన ఈ విద్యార్థులు అష్టకష్టాలు పడుతున్నారు. గత ఆగస్టులో ప్రభుత్వం డీ.ఎడ్ లో ప్రవేశానికి ఎంట్రన్స్ నిర్వహించింది. కానీ అప్పుడు పరీక్షలు రాసిన విద్యార్థులకు ఇప్పటివరకు సీట్లు కేటాయించలేదు.. దీంతో డిగ్రీ చేయలేక డీఎడ్ లో చేరలేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. దీని కారణంగా ఒ క సంవత్సరం విద్యాసంవత్సరాన్ని వాళ్లు కోల్పోతున్నారు..
డీ.ఎడ్ చేసినవాల్లే టీచర్ పోస్టుల్లో ఎస్.జీ.టీ పోస్టులకు అర్హులు కావడంతో ఇప్పుడు డీ.ఎడ్ కు డిమాండ్ ఏర్పడింది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని విద్యార్థులు యోచిస్తున్నా.. ఇప్పటివరకు కౌన్సిలింగ్ పెట్టకపోవడంతో ఒక సంవత్సరం విద్యాసంవత్సరాన్ని వారు కోల్పోతున్నారు..