Breaking News

ఏటీఎంలు.. ఇక పోస్టాఫీసుల్లోనూ..

post-office

నల్గొండ, ప్రతినిధి : ఏటీఎం.. ఎనీ టైం మనీ.. వీటి రాకతో బ్యాంకులకు పని తక్కువైంది. వినియోగదారులకు డబ్బులు తీసుకోవడం సులువైంది. ఏటీఎంల రాకతో వినియోగదారుల చాలా అవసరాలు తీరుతున్నాయి. అంతటి ప్రాముఖ్యం గల ఏటీఎం సేవలను ఇప్పుడు పోస్టాఫీసులు అందిపుచ్చుకుంటున్నాయి.. తెలంగాణ రాష్ట్రంలోని మొత్తం 32 హెడ్ పోస్టాఫీసుల్లో ఏటీఎం సేవలను ప్రారంభిస్తున్నట్టు పోస్ట్ మాస్టర్ జనరల్ కల్నల్ ఎం. ఎలీషా తెలిపారు. శనివారం ఆయన నల్లొండ లో ఈ విషయం చెప్పారు.

బ్యాంకులకు ధీటుగా పోస్టాఫీసుల ద్వారా సేవలను అందిస్తున్నామని చెప్పారు. ప్రధాని ప్రవేశపెట్టిన బేటి బేటి పడావా కార్యక్రమంలో భాగంగా బాలికలకు ప్రత్యేక ఖాతాలు తెరిపిస్తున్నామని తెలిపారు. పోస్టాఫీసుల్లో మీసేవ, ఈసేవ రైల్వే రిజర్వేషన్లతో పాటు అనేక పౌర సేవలను అందిస్తున్నట్టు చెప్పారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *