
హైదరాబాద్, ప్రతినిధి : కస్టమర్స్ ను ఆకర్షించేందుకు కలిసివచ్చే ఏ అంశాన్ని వదలుకోవడం లేదు బ్యాంకులు. ATM కేంద్రాలకు బ్యాంకులు కల్పించే భద్రత, సీసీ కెమేరాలు, ఎయిర్ కండీషనర్స్ ఏర్పాటు చేయడంతో బ్యాంకుల నిర్వహణ ఖర్చులు తడిసిమోపడవుతున్నాయి. దీంతో పెరిగిపోతున్న ఖర్చులు తగ్గించుకోనేందుకు రీసెంట్ గా బ్యాంకులు కస్టమర్స్ విత్ డ్రాస్ పై లిమిట్ విధించి ఖర్చునుంచి కాస్త ఉపశమనం పొందాయి.
ఇదే పద్ధతిలో ఖర్చులు తగ్గించుకోవడంతోపాటు ప్రజలకు మరింత దగ్గరగా వెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నాయి. ఇందులో భాగంగానే రోజులో కనీసం 150 నుంచి 200 వరకు విత్ డ్రా చేసే కస్టమర్స్ కోసం చిన్నచిన్న దుకాణాల్లో ATM సెంటర్స్ ను ఓపెన్ చేసేందురు రెడీ అవుతున్నాయి ఇతర బ్యాంకుల ఖాతాదారులు తమ తమ ATM సెంటర్స్ క్యాష్ విత్ డ్రా చేసేందుకు కలిసి వచ్చే ప్రతి అంశాన్ని యూజ్ చేసుకుంటున్నాయి.
గ్రామీణా ప్రాంతాల్లో…
కాస్తా రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ఏటీఎం సెంటర్స్ ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చాయి ICICI బ్యాంక్, ఆంధ్రాబ్యాంక్. కిరాణషాప్స్ లో ఏర్పాటు చేసే ఏటీఎంలకు దుకాణదారులు కూడా పెట్టుబడుపెట్టి ప్రతి లావాదేవి నుంచి 8 రుపాయల వరకు లాభం వచ్చే ఛాన్స్ ఉండడంతో.. ఇపుడు రిటైల్ ఏటీఎం విధానంపై కసరత్తు చేస్తున్నాయి.