ఏక్ భారత్ శ్రేష్ట్ భారత్ పై హర్యానా అధికారులతో టూరిజం , సాంస్కృతిక కార్యదర్శి బుర్ర వేంకటేశం గౌడ్  చర్చ

 

 

ఏక్ భారత్శ్రేష్ఠ్ భారత్ పై తెలంగాణ టూరిజం కార్యదర్శి బుర్ర వేంకటేశం సమావేశం నిర్వహించారు. సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడి సమక్షంలో ఇరు రాష్ట్రాలు  కుదుర్చుకున్న ఓప్పందాన్ని మరింత ముందుకు తీసుకుని వేల్లడం పై హర్యాణా ప్రభుత్వ ఉన్నతాధికారులతో తెలంగాణ టూరిజం, సాంస్కృతిక,భాషా , ఉన్నత విద్య శాఖ ఆధికారులు తెలంగాణ టూరిజం కార్యదర్శి బుర్ర వేంకటేశం నేతృత్వంలో సుదీర్గంగా చర్చించారు. ఏక్ భారత్ శ్రేష్ట్ భారత్ కార్యక్రమం ద్వారా భిన్న సంస్కృతులు కలిగి ఉన్న మన దేశంలో ఉన్న రాష్ట్రాల మద్య ఉన్న సత్ సంబందాలు మరింత బలోపేతం కావడంతో పాటు రాష్ట్రాల మద్య సాంస్కృతిక , చారిత్రిక, భాషా సంబందాలు మరింతగా ముందుకు వేల్లతాయన్నారు టూరిజం , సాంస్కృతిక శాఖ కార్యదర్శి బుర్ర వేంకటేశం

 

ఏక్ భారత్ శ్రేష్ట్ భారత్ కార్యక్రమంలో భాగంగా తెలంగాణహర్యాణా రాష్ట్రాల మద్య కుదిరిన ఓప్పందం పై ప్రధానమంత్రి నరేంద్ర మోడి పలు వేదికలపై ప్రశంసలు కురిపించారన్నారు టూరిజం మరియు సాంస్కృతిక కార్యదర్శి బుర్ర వేంకటేశం. తెలంగాణ , హర్యాణా రాష్ట్రాల మద్య 27 అంశాలపై ఏక్ భారత్ శ్రేష్ట్ భారత్ లో  ఆవగాహన ఓప్పందం కుదిరిందన్నారు. ఓప్పందంలో పోట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ప్రధాన భూమిక పోషించబోతుందన్నారు. ఓప్పందంలో భాగంగా తెలంగాణ టూరిజం, సాంస్కృతిక, క్రీడా, భాషా , విద్యా కార్యక్రమాలతో పాటు హస్త కళల, పేయింటింగ్స్, రాష్ట్ర పండుగలను పరస్పరం గా తెలంగాణ రాష్ట్ర పండుగలను హర్యణాలో నిర్వహించుకోవటం. హర్యాణా రాష్ట్ర పండుగులను తెలంగాణ లో నిర్వహించుకోవడం వల్ల ఇరురాష్ట్రాల మద్య సాంస్కృతి సాంప్రదాయాలు మరింత విసృతం ఆవుతాయన్నారు తెలంగాణ టూరిజం మరియు సాంస్కృతిక కార్యదర్శి బుర్ర వేంకటేశం

 

ఏక్ భారత్ శ్రేష్ట్ భారత్ కార్యక్రమంలో భాగంగా హర్యాణా కళాకారులు తెలంగాణ నృత్యం లంబాడా డాన్స్ ను నేర్పించడం జరిగిందని, హర్యాణా డాన్స్ గుమార్  ను తెలంగాణ రాష్ట్ర కళాకారులు నేర్చుకున్నారని టూరిజం కార్యదర్శి బుర్ర వేంకటేశం వెల్లడించారు. మే నెల రెండో వారంలో  తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం  తెలంగాణ సంభరాలు పేరిట హర్యాణా రాష్ట్రంలో సంభరాలను నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. తెలంగాణ రాష్ట్రంలో ఆక్టోబర్ నెలలో హర్యణా రాష్ట్ర పెస్టివల్ ను నిర్వహించనున్నట్లు హర్యణా ఆధికారులు తెలిపారని బుర్ర వేంకటేశం వివరించారు. హర్యాణా రాష్ట్ర పోటో గ్రాఫర్లు బృందం నెల 24 రాష్ట్రం లో పర్యటించి కాఫీ టేబుల్ బుక్ రూపోందిస్తారన్నారు. త్వరలో తెలంగాణ రాష్ట్రం నుంచి పోటో గ్రాఫర్ బృందం హర్యాణా రాష్ట్రం లో పర్యటించి కాఫీ టెబుల్ బుక్ ను రూపోందిస్తారని టూరిజం మరియు సాంస్కృతిక కార్యదర్శి బుర్ర వేంకటేశం పేర్కోన్నారు.

 

సమావేశంలో తెలంగాణ టూరిజం ఎం డి డా. క్రిస్టినా జడ్ చోంగ్తూ, టూరిజం కమీషనర్ సునీతా భగవత్,తెలంగాణ విద్యా శాఖ జూయింట్ సేక్రటరీ విజయ్ కుమార్, కల్చరల్ డైరెక్టర్ మామిడి హరికృష్ణ లతో పాటు హర్యాణా రాష్ట్ర ఉన్నత విధ్య డైరెక్టర్ శ్రీనివాస్ నేతృత్వంలో ఉన్నతాధికారుల బృందం సమావేశంలో పాల్గోన్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *