Breaking News

ఏకగ్రీవంగా ఎన్నికైన నారదాసు, భానుప్రసాద్ రావు

TRS(43)

కరీంనగర్ : కరీంనగర్ ఎమ్మెల్సీల స్థానానికి పోటీపడిన టీఆర్ఎస్ అభ్యర్థులు నారదాసు లక్ష్మణరావు, భానుప్రసాద్ రావులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కాంగ్రెస్, టీడీపీ, ఇతర స్వంతంత్ర్య సభ్యులందరూ నామినేషన్ల చివరిరోజు అయిన నేడు తమ నామినేషన్లను విరమించుకోవడంతో నారదాసు, భానుప్రసాద్ రావులు ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు ఎన్నికల అధికారులు ప్రకటించారు. ఈ సందర్భంగా వారిని టీఆర్ఎస్ నాయకులు, మంత్రి ఈటెల రాజేందర్ అభినందించారు. అభిమానులు టాపాసులు కాల్చి సంబరాలు చేసుకున్నారు.
నారదాసు బయోడేటా..
కాగా నారదాసు టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి కేసీఆర్ వెంట ఉన్నారు. గతంలో ఎమ్మెల్సీగా కరీంనగర్ నుంచి ప్రాతినిధ్యం వహించారు. ఒక మారు ఎమ్మెల్సీగా ప్రాతినిధ్యం వహించిన అనంతరం మరో విడత టీఎన్జీవో నేత స్వామి గౌడ్ కోసం కేసీఆర్ ఆదేశాల మేరకు సీటును త్యాగం చేశారు. అప్పుడు కరీంనగర్ నుంచి స్వామిగౌడ్ ఎన్నికయ్యారు. ఆ తరువాత 2014 ఎన్నికల్లోనూ కరీంనరగ్ ఎమ్మెల్యే టికెట్ ఆశించగా.. గంగుల కమలాకర్ కు టీఆర్ఎస్ టికెట్ వచ్చింది. అప్పటి నుంచి కేసీఆర్ ఆదేశానుసారం వెయిట్ చేస్తూ వస్తున్నారు. ఎట్టకేలకు కరీంనగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కేసీఆర్ కరీంనగర్ నుంచి టికెట్ ఇచ్చి గెలిపించారు..

కాంగ్రెస్ నుంచి అందిరినీ తీసుకొచ్చిన భానుప్రసాద్ రావు..
కాగా కరీంనగర్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీచేసి గెలిచిన భానుప్రసాద్ రావు .. కేసీఆర్ ఆహ్వానం మేరకు టీఆర్ఎస్ లో చేరారు. తాను చేరడంతో అప్పట్లో రాష్ట్రం ఏర్పడగానే తనతో పాటు 8 మంది కాంగ్రెస్ ఎమ్మెల్సీలను టీఆర్ఎస్ లో చేర్పించి కేసీఆర్ మన్ననలు పొందారు. ఆ సాన్నిహిత్యంతోనే కేసీఆర్ కరీంనగర్ నుంచి ఎమ్మెల్సీగా భానుప్రసాద్ రావును నిలబెట్టి గెలిపించారు. మండలిలో టీఆర్ఎస్ కు బలం ఉందంటే అది భానుప్రసాద్ రావు చలవేనంటారు మండలి సభ్యులు..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *