
తెలుగు రాష్ట్రాల నిత్యావసరాలు ఆకాశన్నంటాయి.. ప్రస్తుత పరిస్థితుల్లో సామన్యులు ఏం కొనేటట్టు లేదు.. ఏం తినేటట్టు లేదు.. ధరా ఘాతం సామాన్యుడు విలవిలలాడుతున్నాడు.. ధరలు పెరగడానికి ప్రధాన కారణం వరుణుడి కరుణ లేకపోవడమే.. తెలుగు రాష్ట్రాల్లో వర్షాభావం వల్ల నిత్యావసరాల ధరలు చుక్కలు చూపిస్తున్నాయి.. ఉల్లి ధర 50 రూపాయలకు చేరింది.. ప్రజాగ్రహంతో ప్రభుత్వం రైతు బజార్ల ద్వారా సరఫరా చేసే పరిస్థితికి తీసుకొచ్చింది..
ఇక పప్పులు, ఉప్పులు, ఇతర నిత్యావసరాల ధరలు సామాన్యుడికి అందడం లేదు.. పప్పులు కిలో కి రూ.150 వరకు పెరిగాయి.. టమాట, ఇతర కూరగాయల ధరలు చాలా పెరగాయి.. 100 రూపాయలు పట్టుకొని మార్కెట్ కు పోతే కనీసం రెండు కిలోల కూరగాయలు కూడా రావడం లేదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు..
ఆకాశన్నంటుతున్న నిత్యవసరాలు, వర్షాభావంతో రైతులు కూరగాయలు పండించకపోవడంతో సామాన్యుడి మెనూలో పౌష్టికాహారం కరువవుతోంది.. వర్షాలు పడి ధరలు దిగితేనే పరిస్థితిలో మార్పు వస్తుంది..