ఏం కావాలి-నీళ్ళు కావాలి నినాదంతో రామగుండంలో ధర్నా

ఏం కావాలి – నీళ్లు కావాలి నినాదంతో ఈ రోజు ధర్మారం లో జరిగినటువంటి ధర్నాకు హాజరైన రామగుండము నియోజక వర్గం మాజీ ఎం ఎల్ ఏ శ్రీ సోమారపు సత్యనారాయణ గారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… గత కొన్ని సంవత్సరాలుగా శ్రీ రామ్ సాగర్ ప్రాజెక్టు పరిధి లోని పంట భూములకు సాగు నీరు అందక ఆయకట్టు పరిధిలోని భూములు బీడు భూములుగా మారుతున్నాయని, పెద్దపల్లి డి-83 & డి – 86  కాల్వల కింద వున్న ఆయకట్టు భూములకు నీరు అందించడంలో ప్రభుత్వం విఫలమైందని, ఇకనైనా రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెరిచి ఈ ప్రాంత ప్రజలకు నీరు అందించాలని ఆయన కోరారు. ఇంకా ఈ ధర్నా లో  మాజీ ఎం పీ. శ్రీ వివేక్, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుజ్జుల రామకృష్ణ రెడ్డి, పెద్ది రెడ్డి, రాష్ట్ర నాయకురాలు బలమూరి వనిత, జిల్లా అధ్యక్షుడు కాసిపేట లింగయ్య , బలమూరి అమరేంధేర్ రావు, ధర్మపురి అసెంబ్లీ ఇంచార్జి కన్నం అంజయ్య, రామగుండము మున్సిపల్ కార్పొరేషన్ మాజీ కార్పొరేటర్ కోదాటి ప్రవీణ్ , పిడుగు కృష్ణ, సోమారపు అరుణ్ కుమార్, మాడ నారాయణ రెడ్డి, సుభాష్, బిక్షపతి,నీరటి శ్రీనివాస్, బద్రి దేవేందర్,  మరియు ముఖ్య నాయకులు , అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *