ఎస్.ఆర్.ఎస్.పి, ఎన్.ఎస్.పి.,నిజాం సాగర్ లపై మంత్రి హరీష్ రావు సమీక్ష.

యాసంగిలో చివరి ఆయకట్టు రైతుకూ సాగునీరు.

కాలువల వెంట క్షేత్ర స్థాయిలో సి.ఈ.ల పర్యవేక్షణ.

ఎస్.ఆర్.ఎస్.పి,ఎన్.ఎస్.పి, నిజాంసాగర్ లలో చివరి ఆయకట్టు రైతులకు కూడా నీరందేలా చూడాలని మంత్రి హరీష్ రావు కోరారు.శ్రీరాంసాగర్‌,నాగార్జునసాగర్, నిజాం సాగర్ ప్రాజెక్టుల పరిధిలో ఆయకట్టుకు రబీ పంటలకు సాగునీటి సరఫరాను క్రమబద్ధం చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలని ఆయన ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు.శుక్రవారం నాడు జలసౌధలో ఈమూడు ప్రాజెక్టుల ఆయకట్టుకు జరుగుతున్న సాగునీటి సరఫరాపై మంత్రి సమీక్షించారు.కాలువల వెంట సి.ఈ.,ఎస్.ఈ,ఈ.,లు ఇతర సిబ్బంది నిరంతరం తిరగాలని,సాగునీటి సరఫరా తీరును క్షేత్ర స్థాయిలో పరిశీలించి,పర్యవేక్షించాలని కోరారు.జిల్లాకలెక్టర్ల సహకారం తీసుకోవాలని కోరారు.రెవెన్యూ సిబ్బందితో సమన్వయంతో పనిచేయాలని మంత్రి కోరారు.సంబంధిత జిల్లా మంత్రులు,ప్రజాప్రతినిధులతో సత్సంబంధాలు కొనసాగించాలని ఆయన అన్నారు.నీరు అత్యంత విలువైనదని, చుక్క నీరు కూడా వృధా పోకుండా ,అత్యంత పొదుపుగా వాడాలని ఆయన కోరారు.సాగునీటి క్రమబద్ధీకరణ వ్యవహారంలో ఎలాంటి లోటుపాట్లు జరిగినా ఈ.ఈ.లదే బాధ్యత అని, వారిపై చర్యలకు ప్రభుత్వం వెనుకాడబోదన్నారు.

నీటిని వదిలినప్పుడు అప్రమత్తంగా ఉండాలని రాత్రీ, పగలూ పర్యవేక్షించాలని ఆదేశించారు.ఈ మూడు ప్రాజెక్టుల పరిధిలో రబీ ఆయకట్టును కాపాడవలసిఉందన్నారు. ప్రధాన కాలువలకు ఆన్ అండ్ ఆఫ్ పద్ధతిలో సాగునీటిని సరఫరా చేస్తున్నందున దిగువనున్న రైతులకు నీరందించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని హరీష్ రావు కోరారు.శ్రీరామ్ సాగర్ లోయర్ మానేరు డ్యామ్ ఎగువ, లోయర్ మానేరు డ్యామ్ దిగువ ప్రాంతాల్లోఉన్న డిస్ట్రిబ్యూటరీలు,ఎన్.ఎస్.పి. ఎడమ కాలువకింద ఉన్న డీస్ట్రిబ్యూటరీలు,నిజాంసాగర్ కింద కాలువల పరిధిలోనూ ఆయకట్టు కు సాగునీటి సరఫరాపై క్షేత్ర స్థాయి పరిస్థితిని మంత్రి సమీక్షించారు.ఎస్.ఆర్.ఎస్.పి. ఎల్ఎండి ఎగువ ప్రాంతాల్లో 4,07,417 ఎకరాలు, ఎల్.ఏం.డి దిగువ భాగాన 1,52,588 ఎకరాలు, ఎన్.ఎస్.పి కింద 5,25,629 ఎకరాలు, నిజాంసాగర్ కింద 1,51,666 ఎకరాలకు ఈ యాసంగిలో తప్పనిసరిగా సాగునీరందించాలని మంత్రి హరీష్ రావు ఆదేశించారు.ఈ సమీక్షా సమావేశం లో ఈ.ఎన్.సి. మురళీధరరావు, సి.ఈ.లు శంకర్, సునీల్, మధుసూధనరావు ,ఎస్.ఈ ,ఈ.ఈ.లు పాల్గొన్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *