తప్పించుకోవడం కోసమే సెక్షన్ 8 తెరపైకి..

ఆంధ్రా రాజకీయాలు ఉక్కిరి బిక్కిరి చేస్తాయి. అబద్దాన్ని కూడా నిజం చేస్తాయి.. ఆ రాజకీయాలతో వేగడం సాధ్యం కాదు.. ఇదంతా ఎందుకంటే ఓటు నోటు వ్యవహారమే ప్రధానాంశంగా గత వారం వరకు తెలుగు రాష్ట్రాలను ఊపేశాయి. కేసీఆర్ పాచికకు ఏపీ సీఎం బెంబేలెత్తిపోయారు. కానీ ఇప్పుడు దాని ఊసే లేదు.. అంతా సెక్షన్ 8 గురించే చర్చ. ఇదంతా ఆంధ్రా రాజకీయమే..

తిమ్మిని బమ్మిని చేయడంలో సిద్ధహస్తులైన ఏపీ నేతలు, ఆంధ్రా మీడియా చంద్రబాబును ఓటుకు నోటు నుంచి ఎలాగైనా తప్పించాలని వ్యూహం రచించాయి. అందుకే ఢిల్లీకి వెళ్లి ఫోన్ ట్యాపింగ్ , సెక్షన్ 8 పై ఆరా ఫిర్యాదు. సంవత్సర ముగిసినా లేనిది సెక్షన్ 8 (హైదరాబాద్ లో గవర్నర్ అధికారాలు) ఇప్పుడే తెరపైకి రావడానికి కారణం ఇదే.. ఈ దెబ్బతో తెలంగాణ ప్రభుత్వానికి హైదరాబాద్ పై అధికారం లేకుండా చేసి ఇరుకున పెట్టాలని నిర్ణయించారు. ఇలా అయిన కేసీఆర్ ను వెనక్కి తగ్గేలా చేయాలని ప్లాన్. అందుకే ఢిల్లీ పెద్దలు, గవర్నర్ తో ఒత్తిడి తీసుకొస్తున్నారు.

ఇదంతా గమనించి సీఎం కేసీఆర్ గవర్నర్ భేటి అయ్యారు. సెక్షన్ 8 అమలు చేసే ప్రస్తకే లేదని.. శాంతిభద్రతలు హైదరాబాద్ లో ఈ ఏడాదిలో ఏమైనా శృతిమించాయా అని ప్రశ్నించారట.. సో.. ఓటుకు నోటు కౌంటరే.. సెక్షన్ 8 అన్నమాట..ఇది ఆంధ్రా రాజకీయం..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *