ఎవడు? ఎవడు? మారాలి

ఎవడు? ఎవడు? మారాలి?
మారాలి, మారాలి అంటాం.ఎవరు ముందు మారాల్సింది?
? మనకు వ్యాయామం చేయకుండానే బరువు తగ్గాలి.కష్టపడకుండానే ఫలితం రావాలి.
మందు, మాంసం తినాలి కానీ ఆరోగ్యం బాగుండాలి.పొగ త్రాగాలి కానీ క్యాన్సర్ రాకూడదు.
?పొద్దునలేచి అరగంట ధ్యానం  చేయడం చేతకాదు కానీ 60 ఏళ్ళదాకా యవ్వనంగా ఉండాలి.
? ఓటు వేయడం చేతకాదు కానీ దేశం మారిపోవాలి. తిరగబడే దమ్ములేదు కానీ అవినీతి అంతమవ్వాలి.
?కాలుష్యం పెరుగుతుందని విసుక్కుంటాం కానీ పుట్టిన రోజు నాడైన ఒక మొక్కలను నాటం.
?  లంచగొండితనం హద్దులు మీరుతుందని మధనపడతాం, అవసరమైనప్పుడు అదే లంచమిచ్చి పనిచేయించుకుంటాం, అవకాశం దొరికితే అదే లంచం పుచ్చుకుంటాం.
? సమాజంలో స్వార్ధం పెరుగిందని ఆక్రోశిస్తాం కానీ కొత్త కరెన్సీ నోట్లను పర్సులో, బీరువాలో దాచుకుంటం.
? పౌరహక్కుల గురించి అనర్గళంగా మాట్లాడుతుంటం కానీ కళ్ళ ముందు క్రైమ్ జరిగిన సాక్షం చెప్పడానికి భయపడి చస్తాం.
?  అన్నం మనం తినాలి కానీ పొట్ట వేరేవారికి పెరగాలి.
?ప్రతీ రోజు ఒక అరగంట ధ్యానం చెయ్యం కానీ మనకు అన్నీ సమకూరేయాలి .
?నిన్ను నీవు మార్చు కొలేవు కానీ ఎదుట వారు మారాలంటావు
?మనం చికెన్ కూడా త్యాగం చేయం కానీ మన నాయకులు గాంధేయవాదులుగా ఉండాలి.మన నాయకులు వ్యాయామం చేయాలి కానీ మనకు పొట్ట తగ్గాలి.
? మనకు జీతాలు పెరగాలి కానీ యాజమాన్యాన్ని ప్రశ్నించే సాహసం చేయం.
?  మనకు ఉద్యోగభధ్రత కావాలి కానీ మనకోసం ఉద్యమించే నాయకులకి సహకరించం.
?  మన సమస్యలన్నీ వెంటనే పరిష్కారం కావాలి, అందుకు యూనియన్ కావాలి కానీ కుంటిసాకులు చెబుతూ  యూనియన్ మీటింగులకి కూడా వెళ్ళం.
?మనం మన భార్య పిల్లలతో ఇంట్లో సంతోషంగా ఉండాలి కానీ మన నాయకులు మన కోసం అహర్నిశలు కష్టపడుతూనే ఉండాలి.
? ఇప్పుడు చెప్పు, ఎవరు ముందు మారాలి?
స్వార్ధం ఎవరు విడిచిపెట్టాలి?

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published.