ఎల్లంపల్లి ప్రాజెక్టు ముంపు గ్రామాల పనులు వేగవంతం చేయాలి: మానక్ రాజ్

ఎల్లంపల్లి ప్రాజెక్టు ముంపు గ్రామాల పనులు వేగవంతం చేయాలి: మానక్ రాజ్

కరీంనగర్: శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు నిర్మాణం క్రింద ముంపుకు గురి అయిన గ్రామాల్లోని ప్రజలకు పునరావాస కాలనీల్లో మౌళిక సదుపాయాలు వేగవంతంగా కల్పించాలని రాష్ట్ర్ర పునరావాస కమీషనర్ మానిక్ రాజ్ అన్నారు. శుక్రువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో కరీంనగర్, ఆదిలాబాదు జిల్లాల రెవిన్యూ, ఇరిగేషన్ తదితర శాఖల అధికారులతో పునరావాస కార్యక్రమాల పై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రాజెక్టు నిర్మాణం వలన భూములు, ఇండ్లు కోల్పోయిన కుటుంబాలకు పునరావాస కాలనీలలో ఇళ్ల నిర్మాణాలు, త్రాగునీరు, రోడ్లు మురికి కాల్వలు, పాఠశాల, అంగన్ వాడీ, పంచాయితీ భవనాలు వంటి సదుపాయాలు కల్పించాలని ఆదేశించారు. పనులు గ్రామాల వారీగా  ఏయే పనులు చేపడుతున్నారు, పనుల ప్రగతి వంటి అంశాలపై గ్రామాల వారీగా రెండు జిల్లాల అధికారులతో ఆయన సమీక్షించారు. పునరావాస కాలనీల్లో గృహ నిర్మాణాలను వెంటనే ప్రారంభించి పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రాజెక్టు నీటి మట్టం గ్రామస్ధులకు తెలియజేసి గ్రామాల్లోని ప్రజలను పునరావాస కాలనీలకు పంపించాలన్నారు. ఈ సమావేశంలో ఆదిలాబాదు జాయింట్ కలెక్టర్ సుందర్ అబ్నార్, కరీంనగర్ అదనపు జాయింట్ కలెక్టర్ డా.ఏ. నాగేంద్ర, నీటి పారుదల శాఖ, గృహ నిర్మాణ శాఖ, సంబంధిత ఇతర శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *