ఎలక్ట్రానిక్ మీడియా పని అయిపోయింది..

ఇన్నాల్లు తెలుగు రాష్ట్రాల్లో రంగుల కళలు చూపించిన ఎలక్ట్రానిక్ మీడియా పని అయిపోయింది. రాజకీయ నాయకులే టీవీలను ఇబ్బడిముబ్బడిగా పెట్టి ఇప్పుడు భారం కావడంతో వదిలేస్తున్నారు. దీంతో దాదాపు 25 కు పైగా న్యూస్ చానాళ్లలో ఇప్పుడు పది కూడా కరెక్ట్ గా నడవడం లేదు. జీతాలు ఇవ్వకపోవడంతో ఆయా సంస్థల్లో జర్నలిస్టులు రోడ్డెక్కి ఆందోళనలు చేస్తున్నారు. దీనంతటికి రాజకీయాలు, డబ్బున్న వాల్లు ఇష్టానుసారం  చానళ్లు పెట్టడమే .. అందుకే ముందు వెనుక ఆలోచించకుండా రాజకీయ నాయకులు వివిధ చానల్స్ ఆరంభించి ఘనంగా ప్రారంబించేశారు. ఆ తరువాత కష్టనష్టాలకు ఒర్వక వదిలేశారు.. ఫలితం ఆ న్యూస్ చానల్ ను నమ్ముకొని వచ్చిన వందలాది మంది జర్నలిస్టులకు జీతాలు లేక రోడ్డున పరిస్థితి ఏర్పడింది..

3 నెలలుగా  EXPRESS tv జర్నలిస్టులకు జీతాలు లేవట..

  మీడియా రంగం అనేది సినిమాల వలే రంగుల కళ.. కొత్తగా చానల్ పెట్టాం.. మీరు వేల జీతాలిస్తాం అనగానే ముందు వెనుక ఆలోచించకుండా కప్పదాట్లు చేస్తారు జర్నలిస్టుల.. ఆ తరువాత రెండేళ్లకే మూతపడడంతో లబోదిబోమంటారు… గత 6 సంవత్సరాలు నుండి తెలుగులో వచ్చిన ఎన్నో న్యూస్ ఛానల్స్ ఇప్పటికే మూతపడ్డాయి. కొన్ని పాక్షికంగా నడుపుతున్నాయి. ఇదంతా ఇన్వెస్టర్లకు తెలుగు మార్కెట్ పై లేని పట్టు, అవగాహన లేమి.  ఇండియాలోనే బిజినెస్ కి అనుకూలమైన ప్రదేశం ఒక్క తెలుగు రాష్ట్రాలే. అటువంటిది తెలుగు రాష్ట్రాల్లోని ఇన్వెస్టర్స్ మాత్రం మీడియాలోకి అడుగులు వేసి నష్ట పోవటం అనేది నిజంగా వారి దురదృష్టకమైన సందర్భాలు ఇవి.

ఇప్పటికే అమాంతం తెలుగులో దూసుకొచ్చిన 6TV, సంవత్సరంలోనే జీతాలు ఇవ్వలేక బోర్లాపడింది. అలాగే కామ్రేడ్ ఛానల్ TV99 పరిస్థితి అంతే. ఇప్పుడు ఇదే కోవలోకి వస్తుంది మరో శాటిలైట్ న్యూస్ ఛానల్ EXPRESS TV. ఇప్పటికే మార్కెట్ లో దీనికి ఉన్న డిమాండ్ తగ్గుతూ వస్తుంది. వీరికి సరైన మార్కెటింగ్ టీం ఉండి, పనిచేసే ఉద్యోగులు ఉన్నప్పటికీ..సంస్థ వీరికి గత 3 నెలలుగా జీతాలు ఇచ్చుకోలేని పరిస్థితి ఏర్పడింది.. దీంతో జర్నలిస్ట్ లు ఇప్పటికే ఈ సంస్థని వీడి పలు సంస్థలకు మార్గాలను సుగమనం చేసుకుంటున్నారు.  కొందరు ఆపీసులోనే జీతాల కోసం ధర్నాలు, ఆందోళనలు చేస్తున్నారు. ఈ దృశ్యాలు , వీడియోలు కొందరు తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో ఈ విషయం బహిర్గతమైంది. ఇలా ఆలోచించకుండా అడుగులు వేసిన కార్పొరేట్ల దెబ్బకు జర్నలిస్టు మిత్రుల బతుకులు రోడ్డున పడుతున్నాయి. కనీసం జర్నలిస్టు సంఘాలు సైతం స్పందించి వీరి జీతాలు ఇప్పించకపోవడంపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *