
పాలకుర్తి నియోజకవర్గంలో చేపడుతున్నఅభివృద్ధికి ఆకర్షితులై అనేక మంది టీఆర్ఎస్ లో చేరుతున్నారు. జనగామ జిల్లా దేవరుప్పుల మండలం సింగరాజుపల్లికి చెందిన పలువురు టీఆర్ఎస్ లో చేరారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎర్రబెల్లి వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారిలో పాలడుగు ఉపల్లయ్య, జటోతు మోహన్, కొంగరి రాములు, తాళ్లపల్లి యాకస్వామి, రాపాక యాదగిరి, రాములు తదితరులు ఉన్నారు.