ఎర్రబెల్లి టీడీపీని ఎందుకు వీడాడంటే..

తెలంగాణలో టీడీపీ పని అయిపోయింది.. తెలంగాణలో పార్టీకి పెద్ద దిక్కు , పెద్ద దిక్కు అయిన ఎర్రబెల్లి దయాకర్ రావు టీఆర్ఎస్ లో చేరడంతో ఇక ఆ పార్టీ చుక్కాని లేని నావలా తయారైంది.. ఎంతో స్టామినా.. ప్రజాబలం ఉన్న ఎర్రబెల్లి టీడీపీలో ఎన్టీఆర్ ఉన్నప్పటి నుంచి ఉంటున్నాడు. పార్టీకి విశ్వాసపాత్రుడిగా.. నమ్మకంగా సైకిల్ తోనే ఉంటున్నారు. చంద్రబాబుకు సైతం రైట్ హ్యాండ్ గా తెలంగాణలో కొనసాగుతున్నారు.  ఇంత నమ్మిన బంటు ఇలా టీఆర్ఎస్ లో చేరడానికి చాలా కారణాలున్నాయి. ముఖ్యంగా టీడీపీకి తెలంగాణలో భవిష్యత్తు లేకపోవడం ప్రధాన కారణం. దీంతో పాటు టీడీపీ అధినేత చంద్రబాబు.. సీనియర్ అయిన ఎర్రబెల్లిని కాదని టీడీపీ తెలంగాణ అధ్యక్షుడిగా కనీసం ఎమ్మెల్యేగా కూడా గెలవని రమణకు పార్టీ అధ్యక్ష పదవులు కట్టబెట్టడం.. దీంతో పాటు రేవంత్ రెడ్డిని తెలంగాణలో ఫోకస్ చేయడంపై ఎంతో కాలంగా గుర్రుగా ఉన్నారు ఎర్రబెల్లి దయాకర్ రావు..దీంతోనే వీటన్నింటిని గమనించిన ఎర్రబెల్లి ఇక టీడీపీ తెలంగాణలో బతికి బట్టకట్టే పరిస్థితి లేదని టీఆర్ఎస్ లో చేరిపోయారు.

 ఇలా కీలక నేతలంతా టీఆర్ఎస్ వలసబాట పట్టడంతో టీడీపీ తెలంగాణలో కుదేలయ్యింది.. ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పటినుంచి ఇప్పటివరకు ఇలాంటి దుస్థితిని టీడీపీ ఎదుర్కోలేదు.. తెలంగాణలో పార్టీని నడిపించాల్సిన పెద్ద దిక్కు ఎర్రబెల్లి సైతం పార్టీని మారారంటే ఇక తెలంగాణలో ఆ పార్టీకి నూకలు చెల్లినట్టే..  ఎర్రబెల్లి సైతం తాను టీడీపీని వీడడం బాధకరమని.. ఇలాంటి దుస్థితి పార్టీకి వస్తుందనుకోలేదని.. భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొనే బాధాతప్త హృదయంతో పార్టీ మారుతున్నట్టు చెప్పారు..

కాగా టీడీపీ స్వయంకృతాపరాధం కూడా ఎన్నికల్లో ఓటమికి కారణంగా తెలుస్తోంది. టీడీపీ అధినేత చంద్రబాబు తెలంగాణలో పార్టీ కాడి వదిలేశాడు. ఏపీలోని విజయవాడలో ఉంటూ తెలంగాణ టీడీపీ బాధ్యతలను కొడుకు లోకేష్ , రేవంత్ రెడ్డిలకు అప్పగించారు. దీంతో లోకేష్ , రేవంత్ లు దూకుడుగా వెళ్తున్నారు తప్పితే పార్టీ నడిపించడంలో ఘోరంగా విఫలమవుతున్నారు. దీంతో పార్టీ కుదేలై దారుణ ఓటములు ఎదురవుతున్నాయి.. ఇప్పటికైనా పార్టీ ని పటిష్ట పరచకపోతే అసలు టీడీపీ ఉనికే తెలంగాణలో లేకుండా పోయే ప్రమాదం ఉంది.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *