Breaking News

ఎర్రబెల్లిని జైలుకు పంపేందుకు పోలీసుల యత్నం

yerrabelli1

ఇటీవల పాలకుర్తిలో టీడీపీ, టీఆర్ఎస్ నాయకులు దాడులకు తెగబడ్డ సంగతి తెలిసిందే.. ఈ దాడుల్లో ఒక పోలీస్ అధికారి ఎస్సైకి తీవ్రగాయాలయ్యాయి.. ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రోద్బలంతో టీడీపీ కార్యకర్తలు పోలీసులపై , టీఆర్ఎస్ కార్యకర్తలపై దాడులకు పాల్పడ్డారు. దాంతో పాటు పోలీస్ అవుట్ పోస్టుపై టీడీపీ కార్యకర్తలు దాడి చేసి పోలీసులపై, అందులోని ఫర్నిచర్, ఇతర వస్తువులను ధ్వంసం చేశారు.

కాగా ఈ దాడి ఘటనలో సూత్రధారి అయిన ఎర్రబెల్లి దయాకర్ రావును సోమవారం అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. దాదాపు 10 కేసుల వరకు ఆయనపై బెయిలబుల్, నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి కోర్టులో ప్రవేశపెట్టారు. కాగా ఎర్రబెల్లికి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది.. ఎర్రబెల్లి లాయర్లు బెయిల్ పిటీషన్ వేయగా.. పోలీసులు బెయిల్ ఇవ్వవద్దంటూ వాదించారు. కోర్టు బెయిల్ ఇవ్వడంలో వ్యతిరేకంగా ఉన్నట్టు సమాచారం. దీంతో ఎర్రబెల్లి జైలుకు కెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *