
ఎన్నికల్లో ఎర్రబెల్లి దయాకర్ రావు భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన సతీమణి ఉషా దయాకర్ రావు కోరారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ మండలం చెర్లపాలెం, తొర్రూర్ పట్టణం సోమ్లా తండాల్లో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎర్రబెల్లి ఆధ్వర్యంలోనే పాలకుర్తి ప్రగతి పథంలో పయనిస్తోందన్నారు. మరోసారి ఆశీర్వదిస్తే పాలకుర్తి ప్రజల రుణం తీర్చుకునేందుకు రాష్ట్రంలోనే ఆదర్శంగా నిలుపుతారన్నారు. నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేసేందుకు గోదావరి జలాలను తీసుకొచ్చినట్లు గుర్తు చేశారు. రాబోయే రోజుల్లో సాగు, తాగునీటి సమస్య శాశ్వత పరిష్కారానికి కృషి చేయనున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు, పార్టీ అభిమానులు తదితరులు పాల్గొన్నారు.