
ఎర్రబెల్లి సతీమణి ఉషా దయాకర్ రావు
ఎర్రబెల్లి దయాకర్ రావుతోనే పాలకుర్తి అభివృద్ధి సాధ్యమని ఆయన సతీమణి ఉషా దయాకర్ రావు అన్నారు.
వరంగల్ రూరల్ జిల్లా రాయపర్తి మండలం తిర్మలాయపల్లి గ్రామంలో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఎర్రబెల్లి దయాకర్ రావును గెలిపించాలని ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నాలుగన్నరేళ్ల తెలంగాణ ప్రభుత్వంలో లబ్ధిపొందిన ప్రజలు, కార్యకర్తలే టీఆర్ఎస్ కు అండన్నారు సీఎం కేసీఆర్ ప్రకటించిన పాక్షిక మేనిఫెస్టోతో కాంగ్రెస్ నేతలు బెంబేలెత్తుతున్నారన్నారు. ఓటమి భయంతోనే టీఆర్ఎస్ మేనిఫెస్టోను విమర్శిస్తున్నారన్నారు. దాచుకోవడం, దోచుకోవడం కాంగ్రెస్ కే తెలుసన్నారు. బడుగుబలహీన వర్గాల అభివృద్ధి టీఆర్ఎస్ తోనే సాధ్యమవుతుందన్నారు. మరోసారి టీఆర్ఎస్ అధికారంలోకి రావాలని ప్రజలు కోరుకుంటున్నట్లు చెప్పారు. ఎన్నికల్లో కాంగ్రెస్ నాయకులను తరిమికొడుతారన్నారు.