ఎర్రబెల్లికి మద్దతుగా టీఆర్ఎస్ లో చేరికలు

ఎర్రబెల్లికి మద్దతుగా టీఆర్ఎస్ లో చేరికలు

పాలకుర్తి టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి ఎర్రబెల్లి దయాకర్ రావకు మద్దతుగా టీఆర్ఎస్ లోకి చేరికలు పెరుగుతున్నాయి. మహబూబాబాద్ జిల్లా తోర్రుర్ మండలం నాంచారి మాడూర్ గ్రామంలోని కాంగ్రెస్ కు చెందిన 20 కుటుంబాలు టీఆర్ఎస్ లో చేరాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎర్రబెల్లి వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రజలను మోసం చేసేందుకు వస్తున్న మహాకూటమికి ఎన్నికల్లో బుద్ధి చెప్పాలన్నారు. నాయకులు, కార్యకర్తలు మహాకూటమి కుట్రను ప్రజలకు వివరించాలన్నారు. ప్రణాళిక బద్ధంగా గ్రామాల్లో ప్రచారం చేపట్టాలన్నారు. టీఆర్ఎస్ కు భారీ మెజార్టీని అందించేందుకు బాధ్యతతో పని చేయాలన్నారు. తెలంగాణలోని అన్ని వర్గాలకు న్యాయం చేసిన ఘనత టీఆర్ఎస్ పార్టీకే దక్కిందన్నారు. మరోసారి పట్టం కడితే రాబోయే రోజుల్లో బంగారు తెలంగాణ నిర్మాణమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ పని చేస్తారని తెలిపారు. అంతకుముందు పార్టీలో చేరిన వారిలో గిద్దె యాకయ్య, శంకరయ్య, ప్రసాద్, లక్ష్మణ్, అనిల్, వెంకన్న, పద్మ, కలమ్మ, స్వప్న, అనూష ఉన్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *