ఎరువుల పంపిణీపై సమీక్షించిన వ్యవసాయ కమిషనర్ డా. ఎం. జగన్ మోహన్, ఐ.ఎ.ఎస్.

బుధవారం వ్యవసాయ కమిషనర్ కార్యాలయంలో వివిధ ఎరువుల కంపెనీల ప్రతినిధులతో వ్యవసాయ కమిషనర్ డా. ఎం. జగన్ మోహన్, ఐ.ఎ.ఎస్., సమావేశమయ్యారు. యూరియా కొరత ఉందనే తప్పుడు ప్రచారం జరుగుతున్న దృష్ట్యా ఈ సమావేశం జరిగింది. ఎరువుల కంపెనీల వారీగా యూరియా స్థితిగతులపై, పంపిణీపై విపులంగా సమీక్షించారు. అయితే పంపిణీ నెమ్మదిగా జరగడానికి కారణాలు అడిగి తెలుసుకున్నారు. జూలై మాసంలో ఇప్పటికే ఇవ్వవలసిన యూరియా, వాస్తవంగా క్షేత్ర స్థాయిలో ఎక్కడెక్కడయితే వ్యత్యాసమున్నదో దానికి కారణాలు అడిగి తెలుసుకున్నారు. ఎన్ ఎఫ్ సి.యల్. ప్లాంట్ ఒకటి మూత పడడం వాస్తవమే అయినా అవసరానికి సరిపడా యూరియా అందుబాటులో ఉన్నదన్నారు. ఎరువుల సరఫరాలో జరుగుతున్న జాప్యాన్ని నివారించి వెంటనే ఎక్కడా రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని, వివిధ కంపెనీల ప్రతినిధులను కోరారు. కేంద్ర ప్రభుత్వ సరఫరా ప్రణాళిక ప్రకారం సరఫరా చేయవలసి ఉన్న మిగిలిన యూరియా మొత్తాన్ని కూడా, జూలై 28 కల్లా సరఫరా పూర్తి చేయాలని వ్యవసాయ కమిషనర్ కోరారు. ఏ ఏ తేదీల కల్లా అందజేస్తారనేది జిల్లాల వారీగా నిర్దిష్టంగా అడిగి తెలుసుకున్నారు. కె. రాములు, జనరల్ మేనేజర్, మార్క్ ఫెడ్ మాట్లాడూతూ… రైతుల అవసరాల మేరకు ప్రాంతాల వారీగా ముందుగానే అంచనాల మేరకు యూరియా నిలవలు ఏర్పాటు చేసినట్లు, ఏ విధమైన కొరత లేదని ఈ సందర్ఫంగా తెలియజేసారు. ఈ సమావేశంలో వ్యవసాయ అదనపు సంచాలకులు జి. నారీమణి, వ్యవసాయ సంయుక్త సంచాలకులు ఎస్. బాలూ నాయక్ సహా వ్యవసాయ అధికారులు, ఎన్.ఎఫ్.సి.యల్., క్రిభ్ కో, స్పిక్, ఇఫ్ కో, ఎం.సి.ఎఫ్.ఎల్., ఐ.పి.ఎల్., ఆర్.సి.ఎఫ్., ఎన్.ఎఫ్.ఎల్., జి.ఎస్.ఎఫ్.సి., జువారి, ఎం.ఎఫ్.ఎల్., సి.ఐ.ఎల్. కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *