ఎయిడ్స్ పెళ్లికొడుకు శోభనం ఆగిపోయింది..

ఓ ముదనష్టపు మూర్ఖుడు ఎయిడ్స్ ఉందని తెలిసి అఘాయిత్యానికి పాల్పడ్డాడు.. ఓ అమాయకపు అమ్మాయిని మోసం చేసి పెళ్లి చేసుకున్నాడు..  ఎయిడ్స్ దాచిపెట్టి పెళ్లి చేసుకున్నాడు. తీరా శోభనం నిన్న రాత్రి జరుగుతుందనగా అధికారులు వచ్చి అడ్డుకున్నారు. అమ్మాయిని రక్షించి ఆ ఎయిడ్స్ యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ యాదార్థ ఘటన పశ్చిమగోదావరి జిల్లా పెనుమంట్ర మండలం నాగళ్లదిబ్బ గ్రామంలో చోటుచేసుకుంది.

అదే గ్రామానికి చెందిన యువకుడు చెడు తిరుగుళ్లు తిరుగుతూ ఎయిడ్స్ అంటగట్టుకున్నాడు. ఈ మధ్య గల్ప్ లో దుబాయ్ కి వెళ్లేందుకు వీసా, పాస్ పోర్టు తీసుకొని వెల్లగా వైద్యపరీక్షల్లో ఎయిడ్స్ ఉందని తేలింది. దీంతో అతడు దుబాయ్ వెళ్లకుండా ఊళ్లోనే ఉంటున్నాడు. ఈ మధ్య పెళ్లి కుదుర్చుకొని చేసుకున్నాడు. తీరా శోభనం టైం కి  ఇతడి గురించి తెలిసిన స్నేహితులు ఇచ్చిన సమాచారంతో అధికారులు వచ్చి శోభనం ఆపి అమ్మాయి ప్రాణాలను రక్షించారు. ఈ సందర్భంగా అధికారులకు గ్రామస్థులు కృతజ్ఞతలు తెలిపి యువకుడిని అరెస్ట్ చేశారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *