Breaking News

ఎమ్మెస్ నారాయణ కన్నుమూత

ms narayana

హైదరాబాద్, ప్రతినిధి : ప్రముఖ హాస్యనటుడు ఎమ్మెస్ నారాయణ(63) కన్నుమూశారు. ఆయన స్వస్థలం పశ్చిమగోదావరి జిల్లా నిడుముర్రు. 1951 ఏప్రిల్ 16 న ఆయన జన్మించారు. ఆయనకు ఒక కుమారుడు, కూతురు. ఎంఎస్ నారాయణకు 5 నంది అవార్డులు లభించాయి. దాదాపు 700 పైగా చిత్రాల్లో ఆయన నటించారు. రెండు రోజుల క్రితం ఫుడ్ పాయిజినంగ్ వల్ల ఆస్పత్రి పాలయ్యారు. సంక్రాంతికి సొంత ఊరు పశ్చిమగోదావరి జిల్లాకు వెళ్లిన ఆయనకు ఫుడ్ ఫాయిజినింగ్ జరిగింది. దాంతో పాటు ఆయనకు మలేరియా సోకడంతో పరిస్థితి తీవ్రమైంది. దీంతో ఆయనను కిమ్స్ ఆస్పత్రికి తరలించారు. ఇవాళ ఉదయం ఆయన ఊపిరితిత్తులు పనిచేయకపోవడంతో చికిత్స పొందుతూ మృతిచెందారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *