Breaking News

ఎమ్మెల్సీ ధ్రువీకరణ పత్రాలు అందుకున్న భానుప్రసాద్, నారదాసు

00011

కరీంనగర్ : కరీంనగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో నామినేషన్ల ఉపసంహరణ అనంతరం ఏకగ్రీవంగా ఎన్నికైన టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థులు భాను ప్రసాద్ రావు, నారదాసు లక్ష్మణ్ రావులు శనివారం రాత్రి జిల్లా ఎన్నికల అధికారి, జేసీ పౌసుమి బసు చేతుల మీదుగా ఎమ్మెల్సీ ధ్రువీకరణ పత్రాలను అందుకున్నారు.

0000022

మొదట ఎమ్మెల్సీ ధ్రువీకరణ పత్రాన్ని భాను ప్రసాద్ రావుకు రిటర్నింగ్ అధికారి అందజేశారు. అనంతరం నారదాసుకు అందజేశారు. వీరికి ధ్రువీకరణ పత్రాన్ని అందజేస్తుండగా కార్యకర్తల జై తెలంగాణ నినాదాలు మిన్నంటాయి. టీఆర్ఎస్ శ్రేణులు ఆనందంలో మునిగితేలారు..

0000000000000002

సాయంత్రం వరకు నాటకీయ పరిణామాల మధ్య స్వతంత్రులు, మిగితా ప్రతిపక్షాల అభ్యర్థులు తమ నామినేషన్లను విత్ డ్రా చేసుకొని టీఆర్ఎస్ అభ్యర్థులైన నారదాసు, భానుప్రసాద్ లకు మద్దతు తెలిపారు. దీంతో వీరి ఏకగ్రీవ ఎన్నికకు మార్గం సుగమం అయ్యింది.. లాంఛనాలన్నీ పూర్తయిన తర్వాత శనివారం రాత్రి 11.30 గంటలకు జేసీ, ఎన్నికల అధికారి అయిన పౌసుమి బసు నారదాసు, భాను ప్రసాద్ రావులకు ఎమ్మెల్సీ గెలుపు ధ్రువీకరణ పత్రాలను అందజేశారు..

అనంతరం టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు భానుప్రసాద్ రావు, నారదాసులను ఊరేగిస్తూ టపాసులు కాలుస్తూ నగరంలో సందడి చేశారు. వీరి వెంట భానుప్రసాద్ రావు సోదరుడు ప్రశాంత్, టీఆర్ఎస్ నాయకులు రఘువీర్ సింగ్, రామకృష్ణారావు, మానకొండూర్ జడ్పీటీసీ సుధాకర్ తో పాటు టీఆర్ఎస్ కార్యకర్తలు ఉన్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *