ఎమ్మెల్సీ ఎన్నిక‌ల‌కు మొత్తం 33 నామినేష‌న్ల దాఖ‌లు

హైద‌రాబాద్ రంగారెడ్డి, మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ శాస‌న మండ‌లి ఉపాధ్యాయ స్థానానికి మొత్తం 33 నామినేష‌న్లు దాఖ‌ల‌య్యాయి. నామినేష‌న్ల గ‌డువు చివ‌రిరోజు అయిన సోమ‌వారం నాడు ప‌ది నామినేష‌న్లు దాఖ‌ల‌య్యాయి. దాఖ‌లైన నామినేష‌న్ల‌లో ప‌లువురు రెండు నుండి మూడు నామినేష‌న్లు కూడా దాఖ‌లు చేశారు. నామినేష‌న్ల ప‌రిశీల‌న రేపు మంగ‌ళ‌వారం జ‌రుగుతుంద‌ని ఎన్నిక‌ల రిట‌ర్నింగ్ అధికారి అద్వైత‌కుమార్ సింగ్ తెలిపారు. ఇప్ప‌టి వ‌ర‌కు నామినేష‌న్లు దాఖ‌లు చేసినవారి వివ‌రాలు  ఇ.ల‌క్ష్మ‌య్య, న‌ర్ర భూప‌తిరెడ్డి, మ‌హ్మ‌ద్ మోయినుద్దీన్ అహ్మ‌ద్‌, ఎస్‌.విజ‌య్‌కుమార్‌, ఏ.వెంక‌ట‌నారాయ‌ణ‌రెడ్డి, పాప‌న్నగారి మాణిక్‌రెడ్డి, కాటేప‌ల్లి జ‌నార్థ‌న్‌రెడ్డి, జీ.హ‌ర్ష‌వ‌ర్థ‌న్‌రెడ్డి, ఏ.ల‌క్ష్మ‌య్య‌, ఎం.వి.న‌ర్సింగ్‌రావు, మీసాల  గోపాల్ సాయిబాబా, అర‌క‌ల కృష్ణ‌గౌడ్‌, డా.వి.న‌తానియెల్‌, జ్ఞానేశ్వ‌ర‌మ్మ‌, ఎం. మ‌మ‌త‌, ఏ.వెంక‌ట‌నారాయ‌ణ‌రెడ్డి, కోయ‌ల్‌కార్ బోజురాజు, సంతోష్‌యాద‌వ్‌లు ఉన్నారు. ఈ నెల 23వ తేదీన నామినేష‌న్ల ఉప‌సంహ‌ర‌ణ ఉంటుంద‌ని, మార్చి 9వ తేదీ ఉద‌యం 8గంట‌ల నుండి సాయంత్రం 6గంట‌ల వ‌ర‌కు పోలింగ్ నిర్వ‌హించ‌డం జ‌రుగుతుంది.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *