
-టీఆర్ఎస్ అభ్యర్థి దేవీ ప్రసాద్ పై బీజేపీ అభ్యర్థి రాంచంద్రరావు ఘనవిజయం
హైదరాబాద్ : హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్ నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలో అధికార టీఆర్ఎస్ కు భంగపాటు తప్పలేదు. ఈ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి రాంచంద్రరావు.. 13318 ఓట్ల మెజార్టీతో టీఆర్ఎస్ అభ్యర్థి దేవీ ప్రసాద్ రావు పై ఘన విజయం సాధించారు. ఈ గెలుపు ఆషామాషీ గెలుపు కాదు.. ఏకంగా 13 వేలకు పైగా మెజార్టీతో బీజేపీ టీఆర్ఎస్ ను తుక్కుతుక్కుగా ఓడించింది.