Breaking News

ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ 4, కాంగ్రెస్ 2

635870712840329775

తెలంగాణలోని స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ దూకుడు ప్రదర్శించింది.. ఇప్పటికే ఆరుస్థానాల్లో ఏకగ్రీవంగా గెలుచుకున్న టీఆర్ఎస్ ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో నాలుగు స్థానాల్లో విజయం సాధించింది.. కాంగ్రెస్ రెండు సీట్లతో మళ్లీ తన ప్రభను చాటింది.. నల్గొండలో బలం కాంగ్రెస్ మహబూబ్ నగర్ లోని ఒక చోట కూడా ఊహించని విధంగా గెలిచి కూనరిల్లుతున్న పార్టీకి ఉపశమనం కలిగించింది..

నల్గొండ బరిలో నిలిచిన మాజీ ఎంపీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి 118 ఓట్ల తేడాతో టీఆర్ఎస్ అభ్యర్థి తేరా చిన్నప్పరెడ్డిపై గెలిచారు. కాంగ్రెస్, టీఆర్ఎస్ ప్రతిష్టాత్మకంగా భావించిన ఈస్థానంలో మంత్రి జగదీశ్ రెడ్డి వ్యూహాలు పారలేదు. ఇక ఖమ్మంలో 31 ఓట్ల ఆధిక్యంతో టీఆర్ఎస్ అభ్యర్థి బాలసాని లక్ష్మీనారాయణ సీపీఐ అభ్యర్థి పువ్వాడ నాగేశ్వరరావుపై విజయం సాధించాడు..

ఇక మహబూబ్ నగర్ లోని రెండు స్థానాల్లో ఒకటి టీఆర్ఎస్, మరొకటి కాంగ్రెస్ గెలుచుకున్నాయి.. టీఆర్ఎస్ అభ్యర్థి కసిరెడ్డి నారాయణ రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి కూచికుళ్ల దామోదర్ రెడ్డి మహబూబ్ నగర్ నుంచి గెలుపొందారు.

ఇక రంగారెడ్డి జిల్లాలో రెండు స్థానాల్లో అధికార పార్టీ టీఆర్ఎస్ అభ్యర్థులు నరేందర్ రెడ్డి, శంభీపూర్ రాజు లు విజయం సాధించారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *