
తెలంగాణ, ఏపీల్లో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు బుధవారం కొనసాగుతోంది. ఎన్నికల సంఘం అధికారులు బ్యాలెట్ పత్రాలను లెక్కిస్తున్నారు. తెలంగాణలో వరంగల్, హైదరాబాద్ స్థానాలకు, ఏపీలో తూర్పుగోదావరి, కృష్ణ జిల్లాల ఎమ్మెల్సీ స్థానాలకు ఓట్ల లెక్కింపు జరుగుతోంది.
కాకినాడలో యూటీఎఫ్ అభ్యర్థి రామసూర్యరావు ముందంజలో ఉన్నారు. టీడీపీ అభ్యర్థి చైతన్య రాజు వెనుకంటలో ఉన్నారు. వరంగల్, హైదరాబాద్ స్థానాల్లో ఇంకా తుది కౌటింగ్ జరుగుతోంది.