Breaking News

ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల

Telangana-Legislative-MLC-Elections-2015

తెలంగాణలో స్థానిక సంస్థల కోటా శాసనమండలి స్థానాలకు ఎన్నికల షెడ్యూల్ ను కేంద్రం ఎన్నికల సంఘం రిలీజ్ చేసింది. డిసెంబర్ 2 నుంచి నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్టు తెలిపింది. ఇప్పటి నుంచి ఎన్నికల కోడ్ కూడా అమల్లోకి వచ్చింది.

నామినేషన్లకు చివరి తేది డిసెంబర్ 9, పరిశీలన 10వ రకు ఉంటుంది.పోలింగ్ 27న ఉంటుందని.. డిసెంబర్ 30న ఓట్ల లెక్కింపు ఉంటుందని ఎన్నికల సంఘం తెలిపింది.

హైదరాబాద్ మినహా 9 జిల్లాల్లో మొత్తం స్థానిక సంస్థ ఎమ్మెల్సీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల కమిషన్ మంగళవారం షెడ్యూల్ విడుదల చేసింది. రంగారెడ్డి, మహబూబ్ నగర్, కరీంనగర్ జిల్లాలకు రెండేసి చొప్పున, మిగిలిన జిల్లాలకు ఒకటి చొప్పున మొత్తం 12 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగునున్నాయి.

దీంతో ఆశావాహులు సీఎం కేసీఆర్ ను ప్రసన్నం చేసుకోవడానికి క్యూ కట్టారు. ఇటు వరంగల్ ఎన్నికలు ముగిసాయో లేదో అప్పుడే ఎమ్మెల్సీ ఎన్నికలకు తెరలేవడంతో ఎన్నికల హాడావుడి నెలకొంది.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *