Breaking News

ఎమ్మెల్యేల అనర్హతపై ఆదేశించలేం..

0

హైదరాబాద్, ప్రతినిధి : టీడీపీ , కాంగ్రెస్ ల నుంచి టీఆర్ఎస్ లో చేరిన ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని పిటీషన్ వేసిన కాంగ్రెస్ , టీడీపీ నాయకులకు హైకోర్టులో చుక్కెదురైంది. ఎన్నికల ఫలితాల అనంతరం కాంగ్రెస్, టీపీపీల నుంచి పెద్ద ఎత్తున ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ లో చేరారు. వారిపై చర్య తీసుకోవాలంటూ ఇటీవల కాంగ్రెస్, టీడీపీ నాయకులు హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. వారిపై అనర్హత వేటు వేయమని స్పీకర్ ను ఆదేశించాలని కోరారు..

కానీ హైకోర్టు ఈ పిటీషన్లను తిరస్కరించింది. రాజ్యాంగ బద్దమైన ఈ ప్రక్రియలో స్పీకర్ ను ఆదేశించే అధికారం హైకోర్టుకు లేదని వ్యాఖ్యానించింది. దీంతో టీడీపీ, కాంగ్రెస్ నాయకుల వ్యూహం బెడిసి కొట్టింది.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *