ఎమ్మెల్యేలు వ్యతిరేకంగా ఓటేస్తే గద్దె దిగుతావా?

Ponnam Prabhakar(1)

హైదరాబాద్ : ఎమ్మెల్సీ ఎన్నికల్లో సీఎం కేసీఆర్ కు ప్రకటించిన అభ్యర్థులకు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వ్యతిరేకంగా ఓటు వేస్తే  సీఎం పదవికి రాజీనామా చేస్తావా అని సీఎం కేసీఆర్ ను మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు. శనివారం హైదరాబాద్ లో మాట్లాడిన ఆయన ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ తీరును దుయ్యబట్టారు.

కేసీఆర్ వైఖరి నచ్చక చాలా మంది వ్యతిరేకిస్తున్నారు. 2001 నుంచి ఉన్నవాళ్లను కాదని పైసలిచ్చిన వాళ్లకు టికెట్లిచ్చాడని ధ్వజమెత్తారు. అందుకే వారిని ఓడించడానికి టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. అమరుల కుటుంబ సభ్యులకు ఓడిపోయే టికెట్లిచ్చిన చరిత్ర కేసీఆర్ ది అన్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *