ఎమ్మెల్యేను 5 కోట్లకు కొనబోయి పట్టుబడ్డ రేవంత్ రెడ్డి

reddy_2423376g

హైదరాబాద్ : తెలంగాణ శాసనమండలి ఎన్నికల్లో గెలిచేందుకు టీడీపీ అడ్డదారులు తొక్కింది. టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి .. నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ కు 5 కోట్ల డబ్బులు పంపిణీ చేస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. దీంతో రేవంత్ రెడ్డి ని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు.

ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థికి ఓటు వేసేందుకోసం నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ కు డబ్బులు పంపిణీ చేస్తుండగా రేవంత్ రెడ్డి పోలీసులకు చిక్కారు . ఇదంతా కూడా పకడ్బందీగా జరిగింది.

రేవంత్ రెడ్డి ముందురోజే నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ ను కలిశారు. టీడీపీ ఎమ్మెల్యేకు ఓటువేస్తే రూ.5 కోట్లు ఇస్తానని డీల్ కుదుర్చుకున్నారు. అన్నమాట ప్రకారం ఆదివారం రూ.50లక్షలతో స్టీఫెన్ ఇంటికి వచ్చాడు. 50 లక్షలు ఇచ్చి మిగితాది రేపు 4.5 కోట్లు ఇస్తానని డీల్ కుదుర్చుకున్నాడు. కాగా స్టీఫెన్ ఈ వ్యవహారంపై ముందురోజు పోలీసులకు ఉప్పదించాడు. దీంతో ఏసీబీ అధికారులు కెమెరాలను అమర్చి రేవంత్ బండారాన్ని బయటపెట్టారు. 50లక్షలు ఇస్తుండగా రేవంత్ ను పట్టుకొని పోలీస్ స్టేషన్ కు తరలించారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *