ఎన్నికల వేళ.. కేసీఆర్ కీలక నిర్ణయాలు

KCR

వరంగల్ ఉప ఎన్నిక వేళ  సీఎం కేసీఆర్ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వరంగల్ ఉప ఎన్నికల ప్రచారం ఊపందుకోవడం.. టీఆర్ఎస్ మంత్రులను, నాయకులను జనం, కార్యకర్తలు నిలదీస్తున్న వేళ.. కొంచెం ఉపశమన చర్యలు తీసుకున్నారు. జనానికి మేలు చేసే నిర్ణయాలతో వ్యతిరేకత తగ్గించడానికి ప్రయత్నించారు.

నిన్న ఒకరోజు కేసీఆర్ చాలా నిర్ణయాలు, ఫైళ్లపై సంతకాలతో కీలక నిర్ణయాలు చేశారు. అధికారికంగా క్రిస్మస్ వేడుకలను నిర్ణయించారు. ఇందులో భాగంగా 2 లక్షల మంది నిరుపేద క్రైస్తవులకు రాష్ట్ర వ్యాప్తంగా దుస్తులు పంపిణీ చేయాలని కోరారు. స్కూళ్ల హాస్టల్ల లో అమలు చేసిన సన్న బియ్యం అన్నం పథకాన్ని కేసీఆర్ కళాశాలల వసతి గృహాల్లో అమలు చేయాలని కోరారు. అంతేకాదు 2005 నుంచి పెండింగ్ లో ఉన్న ఓయూ విద్యార్థుల మెస్ బిల్లులకు ఒక్కసంతకంతో కేసీఆర్ 7 కోట్ల నిధులను విడుదల చేశారు.

ఇవే కాకుండా ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు పోటీ పరీక్షలకు శిక్షణ ఇవ్వాలని నిర్ణయించారు. బీఆర్ఈ, టోఫెల్ పరీక్షలకూ తీర్చిదిద్దాలని కోరారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *